Bansi Narayan Temple: మనదేశం దేవాలయాలకు.. ఆధ్యాత్మిక సంపదకు ప్రసిద్ధి చెందింది. ఎన్నో అద్భుతాలు మన దేశంలో కనిపిస్తాయి. ఆలయాలు.. వాటి వెనుక ఉండే కథలు ఎప్పుడూ మనల్ని ఉత్తేజితులను చేస్తాయి. దేవాలయాలకు సంబంధించి రకరకాల సంప్రదాయాలు.. విశిష్టతలు మనల్ని ఒక్కోసారి ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. చిన్నా.. పెద్దా అని తేడా లేదు.. ప్రతి దేవాలయం దేనికి దానికి ఒక ప్రత్యేకతతో శోభిల్లుతోంది. కొన్ని దేవాలయాల్లో జరిపే పూజా విధానాలు మనల్ని ఆకర్షిస్తే.. మరికొన్ని ఆలయాల్లో పాటించే ఆచారాలు మనల్ని సంతోషంతో ముంచెత్తుతాయి. ఆధ్యాత్మికతను పెంపొందించే వాతావరణం.. ఎప్పటికప్పుడు నిర్వహించే పూజలు.. మన ఆలయాలకు ఒక ప్రత్యేకతను తీసుకువస్తాయి. నిత్య పూజలతో శోభిల్లే ఆలయాలు కొన్నైతే.. ఒక్కో ఆలయంలో నెలకొకసారి మాత్రమే పూజలు జరుగుతాయి. కేరళలోని స్వామి అయ్యప్ప దేవాలయం ఏడాదిలో కొన్ని ప్రత్యేక రోజుల్లో మాత్రమే దర్శనానికి అవకాశాన్ని కల్పిస్తుంది. అలాగే ఉత్తర భారతావనిలో చార్ ధామ్ యాత్రలో దేవాలయాలు ఏడాదికి ఒకసారి కొన్నిరోజులు మాత్రమే తెరిచి ఉంటాయి. కానీ, మన దేశంలో ఒక దేవాలయంలో మాత్రం ఏడాదికి ఒక్కసారే అదీ ఒకే ఒక్కరోజు కొన్ని గంటల పాటు మాత్రమే దర్శనానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి విశిష్ట దేవాలయం ఉత్తరాఖండ్లో ఉంది.
పూర్తిగా చదవండి..Bansi Narayan Temple: రక్షాబంధన్ రోజున మాత్రమే తెరచుకునే పురాతన ఆలయం.. ఎక్కడుందంటే..
సాధారణంగా దేవాలయాల్లో దేవునికి నిత్యపూజలు జరుగుతాయి. అందుకు విరుద్ధంగా ఏడాదికి ఒకసారి రక్షాబంధన్ రోజున మాత్రమే పూజలు జరిపే దేవాలయం ఉత్తరాఖండ్ లో ఉంది . బన్సీ నారాయణ ఆలయంగా చెప్పుకునే ఆ దేవుని దర్శనానికి భక్తులు బారులు తీరుతారు.
Translate this News: