Punjab National Bank Recruitment: పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్పెషలిస్ట్ ఆఫీసర్(SO) పోస్టులకు రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు విండో ఇవాళ( ఫిబ్రవరి 25, 2024) ముగియనుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. దరఖాస్తు చేయడానికి, అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ pnbindia.in ని విజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 1025 పోస్టులకు నియామకాలు జరుగుతాయి.
దరఖాస్తు రుసుము:
SC/ST/PWBD కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 59. ఇతర కేటగిరీ అభ్యర్థులకు రూ. 1180. దరఖాస్తు రుసుమును డెబిట్ కార్డ్ (రూపే/వీసా/మాస్టర్ కార్డ్), క్రెడిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, IMPS, క్యాష్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. మొబైల్ వాలెట్ లేదా UPIని ఉపయోగించి చేయవచ్చు.
ఎలా దరఖాస్తు చేయాలి?
--> అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి కింద ఇచ్చిన స్టెప్స్‌ను ఫాలో కావాలి.
--> pnbindia.in అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి.
--> హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రిక్రూట్మెంట్ విభాగంపై క్లిక్ చేయండి.
-->పేజీలో అందుబాటులో ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ లింక్‌పై క్లిక్ చేయండి.
--> అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. దీనికి కొత్త డ్రాప్ డౌన్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
--> మీ వివరాలు నమోదు చేసుకోండి.. దరఖాస్తు ఫారమ్‌ను ఫిట్ చేయండి.
--> దరఖాస్తు రుసుము చెల్లించండి.
--> సమర్పించు(submit)పై క్లిక్ చేయండి.
--> తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోని మీ దగ్గర ఉంచుకోండి.
Also Read: ఎస్ఎస్సీ అభ్యర్థులకు అలెర్ట్.. కొత్త వెబ్సైట్ గురించి కీలక అప్డేట్!
WATCH: