Bank Holidays in March 2024: ఇవాళ ఫిబ్రవరి 29. రేపటి నుంచి మార్చి నెల ప్రారంభం కాబోతుంది. ఆర్థిక సంవత్సరం ఎండింగ్ నెల ఇది. బ్యాంకులు(Banks) బిజిబిజీగా మారిపోయే సమయం కూడా ఇదే. మనకు కూడా ఏదోక సమయంలో బ్యాంకులతో పని ఉండే అవకాశం ఉంది. ముందుగా బ్యాంకుకు వెళ్లాలంటే.. బ్యాంకు ఎప్పుడెప్పుడు పని చేస్తుందో తెలుసుకోవాలి.
బ్యాంకులు ఏరోజు పని చేస్తున్నాయో.. ఏ రోజులు సెలవులు ఉన్నాయో ముందుగానే చూసుకోవాలి. ఫిబ్రవరి మరో కొన్ని గంటల్లో ముగుస్తుంది. ఇక మార్చిలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 14 రోజుల పాటు సెలవులు(14 Days Holidays) ఉన్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) ఓ జాబితాను విడుదల చేసింది. ఈ నెలలో మహా శివరాత్రితో(Maha Shivaratri) పాటు .. రెండు , నాలుగు శనివారాలు, ఆదివారాలు ఇలా చూసుకుంటే మొత్తంగా 14 రోజులు మార్చిలో బ్యాంకులకు సెలవులున్నాయి.
అయితే బ్యాంకులకు సెలవులు(Bank Holidays) అయినా ఇప్పుడు అరచేతిలోనే బ్యాంకింగ్ పనులన్ని అయిపోతున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అన్ని పనులు పూర్తి అవుతున్నాయి. అలాగే 14 రోజులు సెలవులు ఉన్నప్పటికీ ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషిన్లు అన్ని కూడా యధావిథిగా ప్రజలకు అందుబాటులో ఉంటాయని బ్యాంకు అధికారులు వెల్లడించారు.
మార్చి నెలలో బ్యాంకులకు సెలవులు ఎప్పుడెప్పుడంటే..
మార్చి 01: చప్చర్ కుట్ (మిజోరాం లో బ్యాంకులకు సెలవు)
మార్చి 03: ఆదివారం (దేశంలోని అన్ని బ్యాంకులకు సెలవు)
మార్చి 08: మహాశివరాత్రి (దేశంలోని చాలా రాష్ట్రాల్లోని బ్యాంకులకు సెలవు)
మార్చి 09: రెండవ శనివారం
మార్చి 10: ఆదివారం
మార్చి 17: ఆదివారం
మార్చి 22 : బీహార్ దివాస్ (బీహార్ లోని బ్యాంకులకు సెలవు)
మార్చి 23: నాలుగో శనివారం
మార్చి 24: ఆదివారం
మార్చి 25: హోలీ(దేశంలో అన్న రాష్ట్రాల బ్యాంకులకు సెలవు)
మార్చి 26: హోలీ(ఒడిస్సా, మణిపూర్ బ్యాంకులకు సెలవు)
మార్చి 27 : హోలీ (బీహార్ లోని బ్యాంకులకు సెలవు)
మార్చి 29 : గుడ్‌ఫ్రైడే (దేశంలోని అన్ని రాష్ట్రాల బ్యాంకులకు సెలవు)
మార్చి 31 : ఆదివారం
మరి ఈ సెలవు రోజులను దృష్టిలో పెట్టుకుని మీ బ్యాంకు పనులను ప్లాన్ చేసుకోండి.
Also Read : ఆ విషయంలో మాత్రం వరుణ్ మీద చాలా కోపంగా ఉంది: చిరంజీవి!