Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఏకంగా 16 రోజులు సెలవులు.. లిస్ట్ చూసుకోండి!

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్‌లో 16 రోజులు బ్యాంక్‌లకు హాలీడేస్‌ ఉన్నాయి. అందులో ఆరు రోజులు వారంతపు సెలవులు ఉండగా.. మిగిలినవి పండుగలు, ఇతర జయంతిలు. శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, మహారాజా హరిసింగ్ జయంతి, ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీకి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

Bank Holidays: సెప్టెంబర్‌లో బ్యాంకులకు ఏకంగా 16 రోజులు సెలవులు.. లిస్ట్ చూసుకోండి!
New Update

Bank Holidays in September: ఒకటో తారీఖు వస్తుందంటే చాలు.. ఆ నెలలో బ్యాంక్‌ సెలవులపై ప్రజలు ఓ లుక్కేసి ఉంచుతారు. ఎందుకంటే ఆర్థిక లావాదేవిలు ఎక్కువగా జరిగేది బ్యాంక్‌ల నుంచే.. సిటీల్లో అంటే ప్రజలు ఆన్‌లైన్‌ చెల్లింపులకు అలవాటు పడ్డారు కానీ.. టౌన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ వినియోగదారులు బ్యాంక్‌లకే వెళ్తుంటారు. రూరల్‌ ఏరియాస్‌లోని కంపెనీల్లో జీతాలు బ్యాంక్‌ అకౌంట్‌లో కాకుండా చేతికి ఇస్తుంటారు. అక్కడ డిపాజిట్‌ మెషీన్ల సంఖ్య కూడా తక్కువగా ఉంటుంది. వీరికి కూడా బ్యాంకే దిక్కు. అందుకే బ్యాంక్‌ హాలీడేస్‌ తెలుసుకునేందుకు వినియోగదారులు ఆసక్తిని చూపిస్తారు.

ఈసారి సగం రోజులే వర్కింగ్‌:
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) హాలిడే క్యాలెండర్ ప్రకారం.. సెప్టెంబర్‌లో 16 రోజులు బ్యాంక్‌లకు హాలీడేస్‌ ఉన్నాయి. వివిధ పండుగలు, రెండో నాల్గవ శని, ఆదివారాలలో ఎప్పటిలాగే బ్యాంకులు క్లోజ్‌. అత్యవసర పనుల కోసం బ్యాంకులకు వెళ్లాలనుకునే కస్టమర్లు సెప్టెంబర్‌లో లిస్టెడ్ బ్యాంక్ సెలవులను గమనించాలి. ఏదేమైనా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలు వినియోగదారులకు అన్ని రోజులూ అందుబాటులో ఉంటాయి. శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి, మహారాజా హరిసింగ్ జయంతి, ఈద్-ఇ-మిలాద్-ఉల్-నబీకి కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు మూసివేసి ఉంటాయి.

సెప్టెంబర్ 18న వినాయక చవితి కారణంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అంతేకాకుండా శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం సెప్టెంబర్ 22న జరుపుకుంటారు దీని కోసం కొన్ని నగరాల్లో బ్యాంకులు వర్క్ చేయవు. బ్యాంకు సెలవులు సాధారణంగా నెగోషియబుల్ ఇన్‌స్ట్రూమెంట్స్‌ యాక్ట్ కింద రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ హాలిడే ఉంటుంది. సాధారణంగా దేశంలో బ్యాంకు సెలవుల్లో బ్యాంకింగ్ రంగం నిర్దేశించిన తప్పనిసరి సెలవులు, వివిధ రాష్ట్రాలు ఆమోదించిన పండుగలు, ప్రత్యేక సందర్భాలకు అదనపు సెలవులు ఉంటాయి. ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు ప్రతి నెలా ఆదివారం, నాలుగో శనివారాల్లో పనిచేయవు.

సెప్టెంబర్ 2023 బ్యాంక్ సెలవుల జాబితా:

1) సెప్టెంబర్ 3, 2023: ఆదివారం

2) సెప్టెంబర్ 6, 2023: శ్రీకృష్ణ జన్మాష్టమి.

3) సెప్టెంబర్ 7, 2023: జన్మాష్టమి (శ్రావణ మాసం-8), శ్రీకృష్ణాష్టమి.

4) సెప్టెంబర్ 9, 2023: రెండో శనివారం.

5) సెప్టెంబర్ 10, 2023: ఆదివారం.

6) సెప్టెంబర్ 17, 2023: ఆదివారం.

7) సెప్టెంబర్ 18, 2023: వర్షిద్ధి వినాయక వ్రతం, వినాయక చవితి.

8) సెప్టెంబర్ 19, 2023: వినాయక చవితి.

9) సెప్టెంబర్ 20, 2023: వినాయక చవితి (రెండో రోజు), నువాఖై (ఒడిశా).

10) సెప్టెంబర్ 22, 2023: శ్రీ నారాయణ గురు సమాధి దినోత్సవం.

11) సెప్టెంబర్ 23, 2023: నాలుగో శనివారం, మహారాజా హరి సింగ్ జన్మదినం (జమ్మూ కాశ్మీర్).

12) సెప్టెంబర్ 24, 2023: ఆదివారం.

13) సెప్టెంబర్ 25, 2023: శ్రీమంత్ శంకరదేవుని జయంతి.

14) సెప్టెంబర్ 27, 2023: మిలాద్-ఎ-షరీఫ్ (మహమ్మద్ ప్రవక్త జన్మదినం).

15) సెప్టెంబర్ 28, 2023: ఈద్-ఎ-మిలాద్ లేదా ఈద్-ఇ-మిలాదున్నాబి (బారా వఫాత్)

16) సెప్టెంబర్ 29, 2023: ఈద్-ఎ-మిలాద్-ఉల్-నబీ (జమ్మూ కాశ్మీర్) తరువాత ఇంద్రజాత్ర- శుక్రవారం

సెప్టెంబర్ వారాంతపు సెలవుల జాబితా
➼సెప్టెంబర్ 3 : ఆదివారం

➼ సెప్టెంబర్ 9: రెండో శనివారం

➼ సెప్టెంబర్ 10: ఆదివారం

➼ సెప్టెంబర్ 17 :ఆదివారం

➼ సెప్టెంబర్ 23: నాలుగో శనివారం

➼ సెప్టెంబర్ 24 : ఆదివారం

నోట్‌: ఇవి ఆర్బీఐ లిస్ట్ చేసిన సెలవులు.. నగరాలకు, జిల్లాలకు, రాష్ట్రాలకు మధ్య సెలవుల్లో డిఫరెన్స్‌ ఉంటుందని గుర్తుంచుకోవాలి.

ALSO READ: యాపిల్‌ లవర్స్‌కి గుడ్‌న్యూస్..ఐఫోన్‌-15 లాంచ్‌ డేట్‌, టైమ్‌ తెలిసిపోయిందోచ్!

#bank-holidays
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe