Bank Holidays: ఆగస్టులో బ్యాంకులకు ఎన్ని రోజుల సెలవులో తెలుసా?

ఆర్బీఐ ఆగస్టు నెల బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ నెలలో మొత్తంగా 13 బ్యాంకు సెలవులు ఉన్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. సెలవుల లిస్ట్‌ ని చూసుకుని బ్యాంకు కు వెళ్లాలనుకునేవారు ముందుగానే ప్లాన్‌ చేసుకుంటే బెటర్‌.

New Update
Bank Holidays : మార్చిలో బ్యాంకులకు 14 రోజుల పాటు సెలవులు.. అలర్ట్‌!

Bank Holidays: ఆర్బీఐ ఆగస్టు నెల బ్యాంక్ సెలవుల జాబితాను విడుదల చేసింది. సాధారణంగా బ్యాంకులకు రెండవ, నాల్గవ శనివారాలు, ఆదివారాలు బ్యాంకులకు సెలవులు. ఇది కాకుండా.. జాతీయ, రాష్ట్ర స్థాయి పండుగలలో కూడా బ్యాంకులకు హాలిడేస్ ఉంటాయి. స్వాంతత్య్ర
దినోత్సవం వంటి జాతీయ పండుగలలో దేశవ్యాప్తంగా బ్యాంకులు మూసి వేస్తారనే సంగతి తెలిసిందే.

అయితే రాష్ట్ర స్థాయి పండుగలలో ఆ రాష్ట్రాలలో మాత్రమే బ్యాంకులకు సెలవు ఉంటుంది. ఆగస్టు నెలలో మొత్తం 13 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు ప్రకటించింది ఆర్బీఐ. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌లో అందించిన సమాచారం ప్రకారం.. ఆగస్టు నెలలో మొత్తం 13 రోజులు బ్యాంకులకు సెలవులు కేటాయించింది. ఈ 13 రోజులు ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకుల సేవలు నిలిచిపోతాయి.

ఆగస్టు నెలలో ఎప్పుడెప్పుడు సెలవులు ఉంటాయో కింద లిస్ట్‌ లో చెక్‌ చేసుకోండి...

ఆగస్ట్ 3 (శనివారం): అగర్తలాలో బ్యాంకు సెలవు
ఆగస్ట్ 4 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 8 (సోమవారం): టెండాంగ్ ల్హో రమ్ ఫాత్ పండుగ సందర్భంగా గ్యాంగ్ టక్‌ లో బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 10 (శనివారం): నెలలో రెండో శనివారం.. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 11 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 13 (మంగళవారం): ఇంఫాల్లో బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 15 (గురువారం): స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 18 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 19 (సోమవారం): రక్షా బంధన్ సందర్భంగా బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 20 (మంగళవారం): కేరళలోని కొచ్చిలో బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 24 (శనివారం): నాలుగో శనివారం.. దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 25 (ఆదివారం): దేశవ్యాప్తంగా బ్యాంకులకు సెలవు
ఆగస్ట్ 26 (సోమవారం): శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బ్యాంకులకు సెలవు

Also read: వయనాడ్‌ బీభత్సం.. ప్రకృతి కోపమా…? మన పాపమా..?

Advertisment
తాజా కథనాలు