Bank Holidays: వచ్చే పదిహేను రోజుల్లో బ్యాంకులు తెరచి ఉండేది ఎన్ని రోజులంటే! అక్టోబర్ నెలలో మొత్తం బ్యాంకులకు 15 రోజులు (Bank Holidays) సెలవులు. అటు నవరాత్రులు, శనివారాలు, ఆదివారాలు అన్ని కలిపి చూసుకుంటే సెలవులు భారీగానే ఉన్నాయి. By Bhavana 26 Sep 2023 in నేషనల్ New Update షేర్ చేయండి ఈ ఏడాదిలో 9 నెల ముగియడానికి ఇంకా నాలుగు రోజులు మాత్రమే టైమ్ ఉంది. అక్టోబర్ (October)నెల ప్రారంభం కానుంది. అయితే అక్టోబర్ నెలలో బ్యాంకు ఉద్యోగులు పండుగ చేసుకుంటారు. ఎందుకంటే అక్టోబర్ నెలలో మొత్తం బ్యాంకులకు 15 రోజులు (Bank Holidays) సెలవులు. అటు నవరాత్రులు, శనివారాలు, ఆదివారాలు అన్ని కలిపి చూసుకుంటే సెలవులు భారీగానే ఉన్నాయి. అక్టోబర్ నెలలో బ్యాంకు పనులు పెట్టుకోవాలనుకునే ఖాతాదారులు ఎవరైనా సరే ముందుగా బ్యాంకు సెలవులు చూసుకుని వెళ్లాల్సిందింగా బ్యాంకు అధికారులు పేర్కొన్నారు. అక్టోబర్ 2 న గాంధీ జయంతి సందర్భంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూత పడనున్నాయి. ఇదిలా ఉంటే అక్టోబర్ 24 దసరా పండుగ రోజు కూడా దేశ వ్యాప్తంగా అన్ని బ్యాంకులు మూతపడతాయి. దీంతో పాటు రెండో శనివారం, నాలుగో శనివారాలు ఉండనే ఉన్నాయి. వీటికి తోడు ఆదివారాలు. మరో పక్క సెలవు రోజుల్లో బ్యాంకులు మూతపడినప్పటికీ కూడా ఆన్ లైన్ సర్వీసులు మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సర్వీసులు మాత్రం యథావిథిగా పని చేస్తాయని బ్యాంకు అధికారులు వివరించారు. ఇక బ్యాంకు ఏటీఎంలు, క్యాష్ డిపాజిట్ మెషిన్స్ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు. సెలవుల జాబితా కింద విధంగా ఉంది. అక్టోబర్ 1 ఆదివారం కారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 2 గాంధీ జయంతి కారణంగా దేశ వ్యాప్తంగా బ్యాంకులు మూతపడనున్నాయి. ఇక్కడికి రెండు రోజులు గడిచిపోగా అక్టోబర్ 8 న ఆదివారం బ్యాంకులకు సెలవు. అలాగే 14 న దేశ వ్యాప్తంగా రెండో శనివారం కావడంతో బ్యాంకులకు హాలీడే. అక్టోబర్ 15 ఆదివారం...బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 18 కటి బిహు కారణంగా గౌహతిలో బ్యాంకులకు హాలీడే. అక్టోబర్ 21 దుర్గాపూజ సందర్భంగా అగర్తల, గౌహతి, ఇంఫాల్, కోల్‌కతాలోని బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 22 ఆదివారం దేశ వ్యాప్తంగా బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 25 దుర్గా పూజ కారణంగా గాంగ్‌టక్ లో బ్యాంకులు మూతపడతాయి. అక్టోబర్ 26 దుర్గాపూజ గ్యాంగ్ టక్, జమ్మూ-శ్రీనగర్ లో బ్యాంకులకు హాలీడే. అక్టోబర్ 27 దుర్గాపూజ రోజున గ్యాంగ్ టక్ లో బ్యాంకులు మూసివేత. అక్టోబర్ 28 లక్ష్మీ పూజ, నాలుగో శనివారం కారణంగా కోల్ కతా తో సహా దేశం మొత్తం బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 29 ఆదివారం బ్యాంకులకు సెలవు. అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా అహ్మదాబాద్ లోని బ్యాంకులకు సెలవు. #bank-holidays #october మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి