Bank Employees : బ్యాంకు ఉద్యోగులకు బంపర్ న్యూస్ - వారానికి రెండు రోజులు సెలవులు.. ఎప్పటి నుంచి అంటే!

సుదీర్ఘ కాలంగా బ్యాంకు ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్‌ ఇన్ని రోజులకు సాకారం అవుతుంది. వారంలో ఐదు రోజుల పని దినాలు ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం.

New Update
Bank Employees : బ్యాంకు ఉద్యోగులకు బంపర్ న్యూస్ - వారానికి రెండు రోజులు సెలవులు.. ఎప్పటి నుంచి అంటే!

Good News For Bank Employees : ఇప్పటి వరకు ఐటీ ఉద్యోగుల(IT Employees) కు మాత్రమే ఉండే సౌలభ్యం, సుఖం ఇక నుంచి బ్యాంకు ఉద్యోగులకు(Bank Jobs) కూడా రానుంది. సుదీర్ఘ కాలంగా బ్యాంకు ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్‌ ఇన్ని రోజులకు సాకారం అవుతుంది. వారంలో ఐదు రోజుల పని దినాలు ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చేందుకు ఆర్థిక మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపితే జూన్ నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం.

వారంలో ఐదు రోజులు పనులు(Weekly 5 Days Work) చేస్తూనే కస్టమర్లకు సేవలు అందించేందుకు మార్పులు , చేర్పులు చేస్తున్నట్లు తెలిపినప్పటికీ పని గంటలు తగ్గే పని కానీ, మరే ఇతర కారణాలు కానీ ఉండవని ఇంతకు ముందే యునైటెడ్ ఫోరం ఆఫ్‌ బ్యాంక్‌ ఎంప్లాయిస్‌(United Forum Of Bank Employees) కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌(Nirmala Sitharaman) కు గతంలో రాసిన లేఖలో వివరణ ఇచ్చింది.

ఇదిలా ఉంటే జీతాల పెంపు గురించి కూడా కేంద్రం త్వరలో ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. లోక్‌ సభ ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే బ్యాంకు ఐదు రోజుల పని దినాలను ఆమోదించవచ్చని తెలుస్తుంది. గతేడాది డిసెంబరులో ఇండియన్‌ బ్యాంక్స్ అసోసియేషన్ , బ్యాంకు యూనియన్లు అవగాహనా ఒప్పందం పై సంతకం చేసిన తరువాత ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగులకు 17 శాతం జీతాలు పెరగనున్నాయి.

వారానికి ఐదు రోజులు పని చేసే ఆర్బీఐ(RBI) కార్యాలయాలు, ఎల్‌ఐసీ ఆఫ్‌ ఇండియా మాదిరిగానే 180 రోజుల్లో ఐదు రోజుల పని వారాన్ని అమలు చేయాలని యూనియన్‌ లు కోరాయి. ఈ ప్రతిపాదనను నవంబర్‌ లో ఐబీఏ, ఉద్యోగుల సంఘాలు ఈ ప్రతిపాదనను ఆమోదించాయి. ఆ తరువాత దానిని ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిశీలను పంపినట్లు నివేదించారు.

ఇప్పుడైతే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగ బ్యాంకులు నెలలో మొదటి, మూడు శనివారాలు పని చేస్తాయి. ఇప్పుడు నెలలో అన్ని శనివారాలు సెలవులుగా వస్తున్నాయి. ఈ విషయం గురించి బ్యాంకు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : చరిత్రలో ఇదే తొలిసాలి.. అబార్షన్ హక్కులను లీగల్‌ చేసిన మొదటి దేశం!

Advertisment
తాజా కథనాలు