Salaries Hike : బ్యాంకు జాబ్స్ చేస్తున్న వారి కష్టాలు తీరనున్నాయి. ఇప్పటి వరకు ఐటీ ఉద్యోగుల(IT Employees) కు మాత్రమే ఉండే సౌలభ్యం, సుఖం ఇక నుంచి బ్యాంకు ఉద్యోగులకు(Bank Jobs) కూడా రానుంది. సుదీర్ఘ కాలంగా బ్యాంకు ఉద్యోగులు అడుగుతున్న డిమాండ్ ఇన్ని రోజులకు నెరవేరుతోంది. దీనికి సంబంధించి భారతీయ బ్యాంకుల సమాఖ్య, బ్యాంకు ఉద్యోగుల సంఘాల మధ్య ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం బ్యాంకు ఉద్యోగులు(Bank Employees) ఇక మీదట వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేయనున్నారు. దానికి తోడు వారి వార్షిక వేతనం కూడా 17 శాతం పెరగనుంది అని ఐబీఏ ఛీఫ్ తెలిపారు.
ఈ నవంబర్ నుంచి..
ఈ ఏడాది 2022 నవంబర్ నుంచి జీతాల పెంపు(Salaries Hike) అమల్లోకి రానుంది. ఈ పెంపు కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఇకపై ప్రతి ఏడాది అదనంగా రూ. 8284 కోట్ల భారం పడనుంది. ఈ జీతాల పెంపుతో ఏకంగా 8 లక్షల మంది బ్యాంకు ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది.8088 DA పాయింట్లను కలిపిన తర్వాత సిబ్బందికి కొత్త వేతన స్కేళ్లు రూపొందించారు. కొత్త వేతన స్కేల్ ప్రకారం.. మహిళా ఉద్యోగులు(Women Employees) మెడికల్ సర్టిఫికెట్ సమర్పించకుండానే నెలకు ఒక సిక్ లీవ్ తీసుకునే అవకాశం కూడా రానుంది. అలాగే బ్యాంక్ ఉద్యోగి రిటైర్ అయిన తర్వాత 255 రోజుల వరకు ప్రివిలేజ్డ్ లీవ్స్‌ను ఎన్‌క్యాష్‌గా మార్చుకోవచ్చు. డ్యూటీ చేస్తున్న సమయంలో మరణించినా కూడా ఈ మొత్తం ఉద్యోగుల కుటుంబాలకు చెల్లిస్తారు. రిటైర్ అయిన ఉద్యోగులకు, పెన్షన్ లేదా ఫ్యామిలీ పెన్షన్ సహా నెలవారీగా ఎక్స్‌గ్రేషియా కూడా అందించనున్నారు.
వారంలో ఐదు రోజులు పని దినాలు..
దీంతో పాటూ బ్యాంకు ఉద్యోగుల మరో ప్రధాన డిమాండ్ కూడా నెరవేర్చడానికి ఐబీఏ ఒప్పుకుంది. ప్రతి ఆదివారంతో పాటు శనివారం కూడా సెలవు ఇవ్వాలనేది బ్యాంకు ఉద్యోగుల వాదన. దీనిపై కూడా ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. అయితే ఈ పనిదినాల డిమాండ్ మాత్రం కేంద్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఈ షెడ్యూల్ అమలులోకి రానుంది.
Also Read : Andhra Pradesh: ఎన్నికల్లో గెలుపే టార్గెట్‌గా..ఉత్తరాంధ్రపై సీఎం జగన్ ఫోకస్