Bangladesh Economy: పాకిస్థాన్ రాజకీయ అస్థిరత, ఆకలి చావులు,ద్రవ్యోల్బణం గురించి భారతదేశంతో సహా ప్రపంచం మొత్తం ఎప్పుడూ చర్చ నడుస్తూనే ఉంటుంది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంకు, చైనా, అమెరికా, మధ్యప్రాచ్యంలోని ధనిక దేశాల ముందు పాకిస్థాన్ పాలకులు అప్పుల కోసం ఎలా నిలబడతారో కూడా ప్రపంచానికి తెలుసు. కానీ బంగ్లాదేశ్‌కు సంబంధించి ప్రపంచంలో అలాంటి ఇమేజ్ లేదు.
పూర్తిగా చదవండి..కొన్ని సంవత్సరాల క్రితం, మన పొరుగు దేశం ఆర్థిక వృద్ధి ప్రపంచంలోని పెద్ద దేశాలను కూడా ఆశ్చర్యపరిచింది. కానీ ప్రస్తుతం అక్కడ ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లయింది. బంగ్లాదేశ్‌కు సంబంధించి ఇప్పుడు బయటకు వచ్చిన డేటా దశాబ్దానికి పైగా ఎప్పుడూ ఇంత దారుణంగా లేదు. ఇప్పుడు బంగ్లాదేశ్‌ను పేద పాకిస్థాన్‌తో పోల్చే పరిస్థితి వచ్చింది అంటేనే విషయం అర్ధం అవుతుంది.
12 ఏళ్ల గరిష్ఠ స్థాయికి ద్రవ్యోల్బణం
Bangladesh Economy: ఇటీవల భారీ రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొన్న బంగ్లాదేశ్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం జూలై నెలలో 12 ఏళ్ల గరిష్ట స్థాయి 11.66 శాతానికి చేరుకుంది. బంగ్లాదేశ్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ విడుదల చేసిన డేటాను ఉటంకిస్తూ స్థానిక వార్తాపత్రిక ద ఢాకా ట్రిబ్యూన్, ఆహార ద్రవ్యోల్బణం కారణంగా జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 12 ఏళ్లలో అత్యధిక స్థాయికి చేరుకుందని పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం గతంలో మేలో 9.94 శాతంగా ఉంది.
ఆహార ద్రవ్యోల్బణం ఎంత?
Bangladesh Economy: గత నెలలో ఆహార ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో 14.10 శాతంగా ఉండగా, ఆహారేతర ద్రవ్యోల్బణం 9.68 శాతంగా ఉంది. అంతకుముందు జూన్ నెలలో, ఈ రెండూ వరుసగా 10.42 శాతం .. 9.15 శాతంగా కనిపించాయి. జూలై నెలలో దేశవ్యాప్త విద్యార్థి ఉద్యమం కారణంగా ఆర్థిక కార్యకలాపాలు దెబ్బతిన్నాయి. ఈ సమయంలో, చాలా రోజులు కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ కూడా నిలిపివేశారు.
బంగ్లాదేశ్‌లో తిరుగుబాటు
Bangladesh Economy: ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ నిబంధనలకు వ్యతిరేకంగా నిరసన మొదలు పెట్టిన నిరసనకారులు, ఆ తర్వాత షేక్ హసీనా నేతృత్వంలోని ప్రభుత్వం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన ఆగస్టు ప్రారంభంలో హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్ళవలసి వచ్చింది. ప్రస్తుతం షేక్ హసీనా భారత్‌లో ఆశ్రయం పొందారు.
పాకిస్థాన్ ద్రవ్యోల్బణం ఇలా
Bangladesh Economy: అయితే, మరోవైపు పాకిస్థాన్‌లో కూడా ద్రవ్యోల్బణం తగ్గలేదు. గణాంకాల ప్రకారం జూన్ నెలలో పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం 12.6 శాతంగా ఉంది. జూలై గణాంకాలు ఇంకా తెలియలేదు. అయితే 2025 ఆర్థిక సంవత్సరంలో దేశంలో సగటు ద్రవ్యోల్బణం రేటు 11.5 శాతంగా ఉండవచ్చని కొన్ని రోజుల క్రితం స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ హెచ్చరించింది. ఇంధన ధరల పెరుగుదల కారణంగా ఇది 13.5 శాతానికి చేరుకుంటుంది.
భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం తగ్గింది
Bangladesh Economy: మరోవైపు, జూలై నెలలో భారతదేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గింది. సోమవారం విడుదల చేసిన అధికారిక గణాంకాల ప్రకారం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.54 శాతంగా నమోదైంది. జూన్ నెలలో ఈ సంఖ్య 5 శాతానికి పైగా ఉంది. ఈ గణాంకాల ద్వారా దేశంలో ద్రవ్యోల్బణం రేటు 5 సంవత్సరాలలో కనిష్ట స్థాయికి చేరుకున్నట్టు అర్ధం అవుతోంది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 4.5 శాతంగా ఉంటుందని దేశ సెంట్రల్ బ్యాంక్ ఆర్బిఐ అంచనా వేసింది. అక్టోబర్ పాలసీ సమావేశంలో ఆర్బీఐ తన అంచనాలను సవరించే అవకాశం ఉంది.
[vuukle]