Bangladeshi Vlogger: బెంగుళూరు ఆటోడ్రైవర్ చేతిలో మోసపోయిన బంగ్లాదేశ్‌ లవ్‌బర్డ్స్‌

ఇండియాలో ఉన్న అందమైన ప్రదేశాలను చూసేందుకు ఓ బంగ్లాదేశ్ జంట భారత్ వచ్చింది. ఈ క్రమంలో బెంగళూరు వచ్చిన ఆ జంటకు ఊహించని షాక్ తగిలింది. వీరిని ఓ ఆటోడ్రైవర్ మోసం చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం అయిందో మీరు కూడా చదివి తెలుసుకోండి.

Bangladeshi Vlogger: బెంగుళూరు ఆటోడ్రైవర్ చేతిలో మోసపోయిన బంగ్లాదేశ్‌ లవ్‌బర్డ్స్‌
New Update

మహ్మద్ ఫిజ్ అనే ఓ బంగ్లాదేశ్ యూ ట్యూబర్. తన గర్ల్‌ఫ్రెండ్‌తో టూరిస్ట్ ప్లేసెస్ తిరుగుతూ యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తుంటాడు. రీసెంట్‌గా బెంగళూరు వెళ్లిన ఈ జంటకు ఊహించని షాక్ తగిలింది. బెంగళూరు బస్టాండ్‌లో దిగిన ఫిజ్ జంట.. ఓ ఆటో మాట్లాడుకున్నారు. వీళ్లు చెప్పిన చోటుకు తీసుకెళ్లడానికి డ్రైవర్ 300 రూపాయలు అడిగాడు. వీళ్లు కూడా ఓకే చెప్పారు. ఆటో డ్రైవర్‌ కూడా చెప్పిన స్పాట్‌లో దింపేశాడు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. మహ్మద్ ఫిజ్ తన దగ్గరున్న 500 రూపాయలను ఆటోడ్రైవర్‌కి ఇచ్చాడు.

అయితే అప్పటికే తన ఎడమ చేతిలో ప్యాసింజర్‌లకు కనిపించకుండా ఓ వంద రూపాయల్ని పెట్టుకున్నాడు ఆ ఆటోడ్రైవర్. వీళ్లిచ్చిన 500 రూపాయల్ని వెంటనే తన చేతి మడతల్లో దాచిపెడుతాడు. ఏమీ ఎరగనట్టు 300 రూపాయలైతే వందే ఇచ్చారు అంటాడు. పాపం నిజమే అనుకున్న టూరిస్ట్ ఫిజ్.. ఆ వంద రూపాయలు తీసుకుని మళ్లీ వేరే 500 రూపాయల నోటు ఇస్తాడు. ఆటో డ్రైవర్ చిల్లర లేదంటే పర్లేదు ఉంచుకో అని చెప్పి వెళ్లిపోతాడు. అంటే 300 ఇవ్వాల్సిన దగ్గర ఫిజ్‌ 900 రూపాయలు ఇచ్చాడు. ఇలా ఆ ఆటో డ్రైవర్ టూరిస్టులను మోసం చేశాడు. రాత్రి వీడియో యూ ట్యూబ్‌లో అప్‌లోడ్ చేద్దామని ఎడిటింగ్‌ చేస్తున్న టైంలో ఫిజ్‌కు ఆటోడ్రైవర్‌ చేసిన మోసం తెలిసింది. దీంతో అవాక్కైన ఫిజ్.. బెంగళూరులో ఈ ఆటో డ్రైవర్‌తో జాగ్రత్త అంటూ తాము ఎలా మోసపోయామో వివరిస్తూ వీడియోను అప్‌లోడ్ చేశాడు.

ఫిజ్‌ అప్‌లోడ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బెంగళూర్ ఆటో డ్రైవర్ల మోసాలపై ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. తమకు జరిగిన చేదు అనుభవాల్ని కామెంట్లు చేస్తున్నారు. బెంగళూరు ఆటో డ్రైవర్ల దురుసు ప్రవర్తనపై ఇప్పటికే చాలా ఫిర్యాదులున్నాయి. ప్రయాణికులతో రూడ్‌గా బిహేవ్ చేయడం, ఎక్కువ డబ్బులు వసూలు చేయడం వంటివి చేస్తున్నారు. ఒక్క జులై నెలలోనే పోలీసులు ఆటోడ్రైవర్లపై 722కు పైగా కేసులు నమోదు చేశారంటే వీరి ప్రవర్తన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే కింద కామెంట్ చేయండి.

ఇది కూడా చదవండి: ఆ రెండు రోజులు స్విగ్గీ, జొమాటో డెలివరీలు బంద్‌!

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి