Bangladesh: ఆగని నిరసనలు.. జైలుకు నిప్పంటించి ఖైదీలను విడిపించిన విద్యార్థులు!

బంగ్లాదేశ్ లో విద్యార్థి నిరసనకారులు రెచ్చిపోయారు. సెంట్రల్ బంగ్లాదేశ్‌లోని నార్సింగి జిల్లాలోని జైలుపై దాడి చేసి జైలు భవనానికి నిప్పంటించారు. అంతటితో ఆగకుండా వందలాది ఖైదీలను విడిపించినట్లు పోలీసులు తెలిపారు.

New Update
Bangladesh: ఆగని నిరసనలు.. జైలుకు నిప్పంటించి ఖైదీలను విడిపించిన విద్యార్థులు!

Bangladesh: బంగ్లాదేశ్ లో విద్యార్థి నిరసనకారులు రెచ్చిపోయారు. సెంట్రల్ బంగ్లాదేశ్‌లోని నార్సింగి జిల్లాలోని జైలుపై దాడి చేసి జైలు భవనానికి నిప్పంటించారు. అంతటితో ఆగకుండా వందలాది ఖైదీలను విడిపించినట్లు పోలీసులు తెలిపారు. ఇదే అదనుగా ఖైదీలు జైలు నుంచి పారిపోయారని, పారిపోయిన ఖైదీల సంఖ్య ఎంత అనేది ఇంకా తెలియరాలేదన్నారు.

షేక్ హసీనా తక్షణ రాజీనామా డిమాండ్..
ఈ మేరకు ఢాకా పోలీసు బలగాలు హింసను కంట్రోల్ చేసే ప్రయత్నంలో అన్ని బహిరంగ సభలను నిషేధించినట్లు పోలీసు చీఫ్ హబీబుర్ రెహ్మాన్ చెప్పారు. ఈ రోజు ఢాకాలో అన్ని ర్యాలీలు, ఊరేగింపులు, బహిరంగ సభలను నిషేధించాం. ప్రజా భద్రతకోసం ఈ చర్య అవసరం. ఇంటర్నెట్ షట్‌డౌన్ ఉన్నప్పటికీ, పోలీసులు నిరసనకారుల మధ్య మరో రౌండ్ ఘర్షణలను ఆగలేదు. మా నిరసన కొనసాగుతుందని అని ఒక నిరసనకారుడు చెప్పాడు. షేక్ హసీనా తక్షణ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. ఈ నిరసనల కారణంగా గాయాలపాలైన 64 మంది ఆసుపత్రుల్లో చికిత్సపొందుతూ మరణించినట్లు తెలుస్తోంది.

సివిల్ సర్వీస్ పోస్టుల్లో మూడింట ఒక వంతు వారి వారసులకు రిజర్వ్ చేస్తూ స్వాతంత్ర్య సమరయోధుల కోటాను హైకోర్టు పునరుద్ధరించిన నేపథ్యంలో జూలై 1న ఆందోళన హింసాత్మక ఘర్షణలకు దారితీసింది.ఢాకా, చటోగ్రామ్, రంగ్‌పూర్, కుమిల్లాతో సహా బంగ్లాదేశ్‌లోని నగరాల్లో వేలాది మంది విద్యార్థులు కర్రలు, రాళ్లతో సాయుధ పోలీసులపై దాడులకు పాల్పడ్డారు. విద్యార్థుల నిరసన, రాళ్లదాడి కారణంగా ఢాకాతోపాటు దేశంలోని ఇతర పెద్ద నగరాల్లో అంతరాయం ఏర్పడింది. ఇది ప్రజలకు కష్టాలకు దారితీసింది. ఎనిమిది జిల్లాల్లో విద్యార్థులు వీధుల్లోకి వచ్చారు. రోడ్లు, రైలు మార్గాలను అడ్డుకున్నారు.


Advertisment
తాజా కథనాలు