Bangladesh MP : గొంతుకోసి, ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌ దాచి.. బంగ్లా ఎంపీ హత్య కేసులో సంచలన విషయాలు!

బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్ అజీమ్‌ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ మే 13న తన న్యూటౌన్ ఫ్లాట్‌లో గొంతు కోసి దారుణంగా హత్యకు గురైయ్యాడు.నిందితులు శరీరం కుళ్లిపోకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలుగా కోసి ప్రత్యేక ఫ్రీజర్ లో ఉంచారు.

MP Murder: ఎంపీ దారుణ హత్య.. చర్మం ఒలిచి.. పసుపు పూసి.. ఇంత ఘోరమా!
New Update

Bangla MP Murder : బంగ్లాదేశ్‌ ఎంపీ అన్వరుల్ అజీమ్‌ (Anwarul Azim) హత్య (Murder) కు సంబంధించిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి.బంగ్లాదేశ్ అవామీ లీగ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ మే 13న తన న్యూటౌన్ ఫ్లాట్‌లో గొంతు కోసి దారుణంగా హత్యకు గురైయ్యాడు. అతడు చనిపోయాడని నిర్ధారించుకోవడానికి మరో సారి అతని తలపై ఏదో బరువైన వస్తువుతో కొట్టారు. నిందితులు శరీరం కుళ్లిపోకుండా ఉండేందుకు మృతదేహాన్ని ముక్కలుగా కోసి ప్రత్యేక ఫ్రీజర్ లో ఉంచారు. ఇరు దేశాల దర్యాప్తు సంస్థల మధ్య జరిగిన సమాచార ఆధారంగా ఈ విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసు వర్గాలు తెలిపాయి.

పోలీసు వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. గత మూడు రోజులు నుంచి నిందితులు ఎంపీ శరీరంలోని వివిధ భాగాలను వేర్వేరు చోట్ల విసిరేశారు. మే 14, మే 15 , మే 18 – ఈ మూడు రోజుల్లో, ఎంపీల శరీర భాగాలను నిందితులు వేర్వేరు ప్రదేశాలకు తీసుకుని వెళ్లి పడేశారు. ప్రధాన నిందితులు ఈ పనిని ఇద్దరు వ్యక్తులకు అప్పగించినట్లు సంబంధిత నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే, మృతదేహా భాగాలను ఎక్కడ విసిరారనే విషయంలో ఇంకా గందరగోళం నెలకొంది. కాగా, ఎంపీ కారులోని సీసీటీవీ ఫుటేజీలు బయటపడ్డాయి. నివాసం లోపల నుండి సీసీటీవీ ఫుటేజీలో, ఒక చిన్న ఎర్రటి కారు ఇంటి ముందుకు రావడం ఈ ఫుటేజీలో కనిపిస్తుంది.

ఆ కారులో నుంచి ముగ్గురు వ్యక్తులు దిగారు. వారిలో బంగ్లాదేశ్ అవామీ లీగ్ దివంగత ఎంపీ అన్వరుల్ అజీమ్ కూడా ఉన్నారు. అతనితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉన్నారు.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు రెడ్ కలర్ కారు (Red Color Car) ను గుర్తించారు. పోలీసులు కారు యజమాని, డ్రైవర్‌ను విచారించడం ప్రారంభించారు. అయితే ఎంపీతో పాటు వచ్చిన వారంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్లిపోయారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులకు తెలిసింది. కానీ దివంగత ఎంపీ మాత్రం ఇంటి నుంచి బయటకు రాలేదు. ఓ పథకం ప్రకారం అన్వరుల్‌ను కోల్‌కతాలో హత్య చేశారని బంగ్లాదేశ్ హోం మంత్రి పేర్కొన్నారు.

Also read: కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదం..బోల్తాపడ్డ ప్రైవేట్‌ ట్రావెల్స్ బస్సు!

#murder #kolkata #bangladesh-mp #red-color-car
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe