/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-2-11-jpg.webp)
New Zealand vs Bangladesh: కివీస్ గడ్డపై బంగ్లా జట్టు సంచలనాలు సృష్టిస్తోంది. వన్డే సిరీస్ చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్ జట్టును చిత్తు చేసి సత్తా చాటిన బంగ్లాదేశ్ టీ20 సిరీస్ మొదటి మ్యాచ్లోనూ అదే ఊపు కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో అనూహ్య విజయంతో సిరీస్‌లో బంగ్లా జట్టు 1-0తో ఆధిక్యంలోకి దూసుకుపోయింది.
ఇది కూడా చదవండి: ఫేర్‌వెల్ సిరీస్‌లో సెంచరీ.. సెల్యూట్ చేసిన కోహ్లీ.. రెండో రోజు ఆటలో ఏం జరిగిందంటే?
కివీస్ పర్యటనలో ఉన్న బంగ్లా టీం మూడు వన్డేల సిరీస్‌లో చివరి మ్యాచ్ లో గెలిచి న్యూజిలాండ్ ఆధిపత్యాన్ని తగ్గించి ఆశ్చర్యం కలిగిస్తూ.. అదే జోష్‌లో టీ20 సిరీస్ మొదలుపెట్టింది. నేపియర్ వేదికగా బుధవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టుపై నెగ్గి ప్రపంచ క్రికెట్ దృష్టిని ఆకట్టుకుంది.
1st Men's ODI victory against New Zealand in New Zealand ✅
1st Men's T20I victory against New Zealand in New Zealand ✅Bangladesh have rewritten their history books on this tour 👏#BANvNZpic.twitter.com/eHZGBKc7fx
— ICC (@ICC) December 27, 2023
తొలుత బౌలింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో కివీస్ జట్టును 134 పరుగులకు పరిమితం చేసింది. స్పిన్నర్ మెహదీ హసన్, షోరిఫుల్ ఇస్లాం పోటీ పడి వికెట్లు తీశారు. బంగ్లా బౌలర్లు కివీస్ టాపార్డర్‌ను దారుణంగా దెబ్బతీశారు. వారి దెబ్బకు ఓపెనర్లు ఫిన్ అలెన్(1), సీఫర్ట్(0)తో పాటు డారిల్ మిచెల్(14), గ్లెన్ ఫిలిప్స్(0) పూర్తిగా విఫలమయ్యారు. జిమ్మీ నీషం (48), కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (23) రాణించడంతో కివీస్ ఆమాత్రం పరుగులైనా చేయగలిగింది.
ఇది కూడా చదవండి: బీచ్‌లో భర్తతో సైనా నెహ్వాల్ బోల్డ్ డ్యాన్స్ 😝.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. వైరల్ వీడియో!
చేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 18.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరింది. ఓపెనర్ లిటన్ దాస్ 42 (నాటౌట్), ఫోర్త్ డౌన్ బ్యాటర్ సౌమ్య సర్కార్ 22 పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ గడ్డ మీద టీ 20 ఫార్మాట్‌లో బంగ్లా జట్టుకు ఇదే తొలి విజయం కావడం విశేషం.