Bandla Ganesh: గాంధీ భవన్ లో కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాలనపై ప్రశంసలు కురిపించారు. నిన్నటితో ప్రజాపాలన 30 రోజులు పూర్తి చేసుకుందని.. అన్ని రాష్ట్రాలు మెచ్చుకునే విధంగా ప్రజాపాలన జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ప్రజాపధం వైపుకు దూసుకుపోతున్నారని కామెంట్స్ చేశారు.
Also Read: ‘మీ కాళ్లు పట్టుకోవాలా’.. సొంత పార్టీ నేతలపై వైసీపీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్..!
ఈర్ష తోనే విమర్శలు..
ఈ సందర్భంగానే మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ లపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికారం కాంగ్రెస్ కు వచ్చిందని.. ఈర్ష పిక్ స్టేజ్ కి చేరుకోవడంతోనే రేవంత్ రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఈ పది సంవత్సరాలు ఏం చేశారు? తెలంగాణకి రావలసిన హామీలపై ఏమైనా కేంద్రంతో కొట్లాడారా? అని ఫైర్ అయ్యారు.
పప్పులే కాదు బిర్యాని కూడా ఉడుకుతుంది..
తెలంగాణకి రావలసిన నిధుల కోసం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కలిసి.. ప్రధానమంత్రి మోదీ , కేంద్ర మంత్రులతో మాట్లాడుతూ పోరాటం చేస్తున్నారన్నారు. వందరోజుల తర్వాత మా పప్పులు ఉడకడం కాదు బిర్యాని కూడా ఉడుకుతుందని హరీష్ రావ్ కు కౌంటర్ ఇచ్చారు బండ్ల గణేష్. అవినీతి అధికారులను పక్కకు తప్పుంచి నిజాయితీ అధికారులను నియమించుకొని పరిపాలన చేస్తున్నారు మా ముఖ్యమంత్రి అంటూ కీర్తించారు.
బండ్ల గణేష్ కు ఎమ్మెల్సీ పదవి..?
వంద రోజుల తర్వాత కూడా కాంగ్రెస్‌ను హరీష్ రావు ఏమీ చేయలేరని..నియంతృత్వ పాలనకు పాతరేసి, ప్రజాపాలన తీసుకొచ్చామని బండ్ల గణేష్ పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో మీరు ఒక్క స్థానం కూడా గెలవరని వ్యాఖ్యనించారు. నెల రోజుల్లో ఇంత గొప్పగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా పాలన చేస్తుంటే.. హరీష్ రావు ఎందుకింత అసూయ పడుతున్నారని ప్రశ్నించారు. అయితే, ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ కు ఎమ్మెల్సీ పదవి వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కాస్త దూకుడుగా మాట్లాడుతున్నారని అంటున్నారు.