Bandits: స్కూల్ పై బందిపోట్ల దాడి.. 280 మంది చిన్నారులు కిడ్నాప్! నైజీరియాలో బందిపోట్లు దారుణానికి పాల్పడ్డారు. కురిగా పాఠశాలపై దాడిచేసి 280 మందికి పైగా చిన్నారులను కిడ్నాప్ చేశారు. వీరంతా 8 నుంచి 15ఏళ్ల వయసులోపు ఉన్నట్లు సమాచారం. దీనిపై ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు స్థానిక గవర్నర్ వెల్లడించారు. By srinivas 08 Mar 2024 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి Mass kidnapping: నైజీరియాకు చెందిన ముష్కరుల గుంపు (Bandits)దారుణానికి పాల్పడింది. స్కూల్ పై మూకుమ్మడిగా దాడి చేసి, భారీ సంఖ్యలో విద్యార్థులను కిడ్నాప్ చేశారు. ఓ టీచర్ తోపాటు దాదాపు 280 మందికిపైగా చిన్నారులను తమ వెంట తీసుకెళ్లారు. ఈ భయంకరమైన ఘటన కడునా రాష్ట్రంలోని చికున్ జిల్లాలోని పాఠశాలల్లో చోటుచేసుకుంది. గాల్లోకి కాల్పులు జరుపుతూ.. ఈ మేరకు పోలీసులు, స్కూల్ యాజమాన్యం తెలిపిన ప్రకారం.. కురిగా పాఠశాల ప్రాంగణంలోకి గురువారం ఉదయం ముష్కరుల గుంపు వచ్చి గాల్లోకి కాల్పులు జరుపుతూ అందరినీ భయభ్రాంతులకు గురిచేసింది. దీంతో వెంటనే అప్రమత్తమైన విద్యార్థులతో పాటు సిబ్బంది అక్కడినుంచి తప్పించుకున్నారు. మరికొంతమంది అక్కడే ఉండిపోగా ఓ టీచర్‌తోపాటు దాదాపు 187 మందిని అపహరించుకెళ్లినట్లు తెసుస్తోంది. అలాగే పక్కనే ఉన్న మరో ప్రైమరీ పాఠశాల నుంచి 125 మందిని కిడ్నాప్ చేశారు. వారిలో 25 మంది తప్పించుకోగా మొత్తంగా 280 మందికి పైగా ముష్కరులు చిన్నారులను ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. వీరంతా 8 నుంచి 15ఏళ్ల వయసులోపు ఉన్నట్లు సమాచారం. ఇది కూడా చదవండి: Bengaluru: మాల్స్ లోనే టాయిలెట్ వెళ్లండి.. ఒత్తిడి చేస్తున్న ఓనర్స్! ఇక ఈ ఇష్యపై స్పందించిన గవర్నర్.. విద్యార్థులను కాపాడేందుకు సాయుధ బలగాలు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించారు. పాఠశాలలపై బందిపోట్లు వరుస దాడులకు పాల్పడటం నైజీరియాలో కామన్ అవుతోంది. వాయువ్య, మధ్య ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు మరింత అధికం. కాగా కిడ్నాప్ చేసి భారీ స్థాయిలో నగదు డిమాండ్ చేయడం (Ransom) వీరికి అలవాటు. #bandits #nigeria #kidnap-280-childrens మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి