Bandi Sanjay : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ..ఏమన్నారంటే..?

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యల గురించి లేఖలో ప్రస్తావించారు బండి సంజయ్.

Bandi Sanjay: బీజేపీలోకి హరీష్‌ రావు.. ఆయనొక్కడే మంచోడంటూ బండి కీలక వ్యాఖ్యలు!
New Update

Bandi Sanjay Letter to Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల (Mid Manair) సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యల గురించి లేఖలో ప్రస్తావించారు బండి సంజయ్.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) బహిరంగ లేఖ రాశారు. మిడ్ మానేరు ముంపు బాధితుల సమస్యను అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయమన్నారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న మిడ్ మానేరు బాధితుల సమస్యల గురించి లేఖలో ప్రస్తావించారు బండి సంజయ్. ఒక్కో బాధిత కుటుంబానికి ఇండ్ల నిర్మాణానికి రూ. 5 లక్షల 4 వేలు చెల్లించాలన్నారు. నీలోజిపల్లి నుండి నందిగామ, ఆగ్రహారం వరకు ఇండస్ట్రీయల్ కారిడార్ ను, స్కిల్ డెవలెప్ మెంట్ కాలేజీని ఏర్పాటు చేయాలని లేఖలో పేర్కొన్నారు.

అర్హత లేకున్నా మిడ్ మానేరు ముంపు ప్యాకేజీ పరిహారం తీసుకున్న రాజ్యసభ సభ్యులు సంతోష్ రావు సహా మాజీ సీఎం కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని లేఖలో తెలిపారు. తక్షణమే సంబంధిత శాఖ మంత్రి, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేయాలని బండి సంజయ్ కోరారు. త్యాగాల పునాదులపై ఏర్పడ్డ తెలంగాణలో ప్రజా అకాంక్షలకు అనుగుణంగా పాలన కొనసాగిస్తూ, ప్రజాస్వామ్యబద్దంగా పనిచేయాలని సూచించారు బండి సంజయ్.

ఇది కూడా చదవండి: వారికి రూ.10 లక్షలు.. మంత్రి కొండా సురేఖ కీలక ప్రకటన

#bandi-sanjay #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe