ఎన్నికలప్పుడే పీవీ గుర్తొస్తారు.. కేసీఆర్ పై బండి సీరియస్

పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా పీవీ ఘాట్‌లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. పీవీ నర్సింహారావుకు ఘనమైన నివాళులు ఆర్పించారు. పీవీ చరిత్ర ఘనమైనది.. దక్షిణ భారతం నుంచి ప్రధాన మంత్రి అయిన ఏకైక వ్యక్తి పీవీనే అని బండి సంజయ్ పేర్కొన్నారు.

New Update
ఎన్నికలప్పుడే పీవీ గుర్తొస్తారు.. కేసీఆర్ పై బండి సీరియస్

Bandi Sanjay Tribute to PV Narsimha Rao

పీవీ జీవితం స్ఫూర్తిదాయకం

తెలంగాణ ముద్దు బిడ్డ.. ఆయన జీవితం అందరికి స్ఫూర్తిదాయకం అని టీ.బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. పీవీ ప్రధాని కావడం తెలంగాణకు గర్వకారణం.. దేశ వ్యాప్తంగా పీవీ జయంతుత్సవాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. పీవీ మరణాన్ని కాంగ్రెస్ పార్టీ అవమాన పరిచింది.. దహన సంస్కారాలు కూడా చేయలేక పోయింది.. కాంగ్రెస్ నాడు…అవమానిస్తే, కేసీఆర్ ఈరోజు పీవీనీ అవమానిస్తున్నాడని బండి సంజయ్ విమర్శించాడు.

మనుషులకు కాదు... కుర్చీకి విలువ

గతంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీవీని స్మరించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏమైంది. కేసీఆర్ పక్క పొలిటీషియన్.. ఓట్లు దండుకొవడం ఎలాగో ఆయనకు బాగా తెలుసు అని బీజేపీ బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ కాదు కేసీఆర్ కింద ఉన్న కుర్చీకి విలువ ఇస్తున్నామన్నాడు.

కాంగ్రెస్ పార్టీ పీవీ నర్సింహారావును అవమానించింది.. బీఆర్ఎస్ ఇప్పటికి అవమానిస్తూనే ఉంది.. గతంలో పీవీ ఘాట్‌ను కూల్చేస్తామని కొందరు మూర్ఖులన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ ఇప్పుడు కాక ఇంకేప్పుడు అడుగుతాడని బండి సంజయ్ ప్రశ్నించారు. నేటికి మన దేశంలో పీవీ ప్రవేశ పెట్టిన సంస్కరణలే కొనసాగుతున్నాయని అన్నాడు.

Advertisment
తాజా కథనాలు