Bandi Sanjay: కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదు..కేటీఆర్ ది బిచ్చపు బతుకు..!!

మంత్రి కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఎంపీ బండీ సంజయ్. కేసీఆర్ సీఎం కాకపోతే కేటీఆర్ ది బిచ్చపు బతుకు అయ్యేదని మండిపడ్డారు. కేటీఆర్ లా తండ్రి పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

New Update
Bandi Sanjay: కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదు..కేటీఆర్ ది బిచ్చపు బతుకు..!!

Bandi Sanjay Shocking Comments On Minister KTR:  మేడిగడ్డ బ్యారేజీ కుంగడంపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తే  తమ పరువు పోయేదన్నారు బండి సంజయ్.  మొన్న కాలేశ్వరం మోటార్లు మునిగిపోయాయని.. ఇవాళ ప్రాజెక్టు కుంగిపోయిందని ధ్వజమెత్తారు.  ప్రాజెక్టుకు ఇంజనీర్ అని చెప్పుకున్న కేసీఆర్ నుంచే  డబ్బులు వసూలు చెయ్యాలన్నారు.  నదులకు నడక నేర్పిన  కేసీఆర్ఎక్కడున్నా బయటకు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ జమ్మి పూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్ తీరుతో  తెలంగాణ నవ్వుల పాలయిందని బండి సంజయ్ విమర్శలు గుప్పించారు.  ప్రాజెక్టు కుంగిపోవడం ఏంటని ప్రశ్నించారు.  కమీషన్ల కోసం కక్కుర్తి  పడ్డ కేసీఆర్.. ప్రజా ధనాన్ని నాశనం చేసిండని ధ్వజమెత్తారు.  కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ క్వాలిటీ మీద లేదని సంజయ్ విమర్శించారు. ప్రాజెక్టును సందర్శించేందుకు ఇతర పార్టీల నేతలను ఎందుకు అనుమతించడం లేదని  ప్రశ్నించారు బండి సంజయ్. ప్రాజెక్టు పరిస్థితిపై కేంద్రానికి పిర్యాదు చేశామని చెప్పారు. మేడిగడ్డ ప్రాజెక్టుపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ ది టూత్ పాలిష్ బతుకని దుయ్యబట్టారు ఎంపీ బండీ సంజయ్. కేసీఆర్ సీఎం కాకపోతే కేటీఆర్ ది బిచ్చపు బతుకు అయ్యేదని మండిపడ్డారు. కేటీఆర్ లా తండ్రి పేరు చెప్పుకుని తాను రాజకీయాల్లోకి రాలేదని అన్నారు. కేటీఆర్ కు ఉన్న అర్హత ఏంటో చెప్పాలన్నారు.  అమెరికాలో చిప్పలు కడిగిన విషయం మరిచిపోయావా అంటూ కేటీఆర్ ను ప్రశ్నించారు.  కేటీఆర్ మాట్లాడేది ఓ భాషేనా? అంటూ  ధ్వజమెత్తారు .

Also Read: కిషన్ రెడ్డి లేఖతో రంగంలోకి కేంద్రం.. రేపు మేడిగడ్డకు స్పెషల్ టీమ్!

Advertisment
Advertisment
తాజా కథనాలు