Bandi Sanjay : సెప్టెంబర్ 17 మరో స్వాతంత్ర పోరాటమే: బండి సంజయ్

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కేంద్ర సాంస్కృతిక శాఖ, హోంశాఖ ఘనంగా నిర్వహిస్తుందని కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. సెప్టెంబర్ 17 మరో స్వాతంత్ర పోరాటమేనని అన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషియే విమోచన దినోత్సవమని కొనియాడారు.

author-image
By srinivas
New Update
india

Bandi sanjay: సెప్టెంబర్ 17 మరో స్వాతంత్ర పోరాటమేనని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ, హోం శాఖ సంయుక్తంగా విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. తాము విమోన దినోత్సవ చరిత్ర, ప్రాముఖ్యతను తెలిపేలా ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తే, చరిత్రను తెరమరుగు చేయడానికి కొందరు ప్రయత్నం చేస్తున్నారంటూ విమర్శలు గుప్పించారు. ఈ మేరకు ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. సర్దార్ వల్లభాయ్ పటేల్ కృషియే విమోచన దినోత్సవమన్నారు. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై మండిపడుతూ.. చరిత్రను వక్రీకరిస్తే వారు కూడా తెరమరుగు అవుతారని అన్నారు.

ఇది ప్రజా వంచన పాలన..

అన్ని వాళ్ళే చేశాం అంటే అధికారికంగా ఎందుకు చేయడం లేదు. సర్దారు పటేల్ ఫోటో ఎందుకు పట్టుకోవడం లేదు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పాలన ఉంది కదా ఎందుకు వేడుకలు నిర్వహించలేదు. నిజాం పాలనను వ్యతిరేకించిన వారిని పోరాట యోధులను గౌరవిం చారా..? కాంగ్రెస్ కు సర్దార్ వల్లభాయ్ పటేల్ చరిత్ర కూడా తెలియదు. ఇప్పుడు ప్రజా పాలన అంటే ఇన్ని రోజులు మీరు చేసింది ప్రజా వంచన పాలననా..? ప్రజా వంచన పాలన అనేది కాంగ్రెస్ కు సూట్ అవుతుంది. కాంగ్రెస్ కు తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదు. 1500 మందిని పొట్టన పెట్టుకున్న కాంగ్రెస్ కు గత బిఆర్ఎస్ గతే పడుతుంది. ఎంఐఎం పార్టీ పేరు గతంలో రజాకార్ల దళం అని పేరు ఉంది. విమోచన దినోత్సవ ప్రాధాన్యత తగ్గించడానికి ఎంఐఎం కు సీఎం వత్తాసు పలుకుతున్నారు. దేశాన్ని పది ముక్కలు చేయాలని చూస్తే కాలేదని వాళ్ళు బాధ పడుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisment
తాజా కథనాలు