కేటీఆర్ నాస్తికుడు; ఎములాడకు బీఆర్ఎస్ చేసిందేం లేదు: ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్ వేములవాడను వారణాశి తరహాలో అభివృద్ధి చేస్తామని ఎంపీ బండి సంజయ్ హామీ ఇచ్చారు. రూ. 400 కోట్లతో వేములవాడను తీర్చిదిద్దుతామని ప్రకటించిన బీఆర్ఎస్ ఇక్కడి ప్రజలను మోసగించిందని విమర్శించారు. సర్వే ఫలితాలను తారుమారు చేస్తూ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. By Naren Kumar 20 Nov 2023 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Bandi Sanjay: ‘‘నేను అభివృద్ధి గురించి మాట్లాడుతుంటే, కేసీఆర్ బాబ్రీ కూల్చివేతపై మాట్లాడుతున్నారు; నేను కరసేవలో పాల్గొన్నట్టు గర్వంగా చెప్తా; కేసీఆర్ కొడుకు నాస్తికుడు, పొరపాటున బీఆర్ఎస్ మళ్లీ గెలిస్తే రాజన్న ఆలయం దగ్గర దర్గా కట్టినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు’’ అని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. వేములవాడ అభివృద్ధికి రూ. 400 కోట్లు కేటాయిస్తామని ప్రకటించి బీఆర్ఎస్ మోసగించిన చరిత్ర బీఆర్ఎస్ ది అని విమర్శించారు. ఎంపీగా తాను భారీగా నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానన్నారు. ఇదికూడా చదవండి: వారి హామీలు ఫేక్.. 3న సర్వేలన్నీ చిత్తు: కిషన్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి హెలికాప్టర్ లో వేములవాడకు వచ్చిన బండి సంజయ్ కు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. బీజేపీ అభ్యర్ధి చెన్నమనేని వికాస్ తో కలిసి సాయిరక్ష కూడలి, జగిత్యాల బస్టాండ్, సుభాష్ నగర్ మీదుగా వేలాది మంది కార్యకర్తలతో రోడ్ షో నిర్వహించారు. సర్వేల పేరుతో జరుగుతున్న ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దని కోరారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. జీహెచ్ఎంసీతో పాటు దుబ్బాక, హుజూరాబాద్ ఉపఎన్నికల సమయంలోనూ ఇలాంటి ప్రచారమే జరగగా, వాటిలో బీజేపీ సత్తా చాటిందని గుర్తుచేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎంఐఎం వద్ద మోకరిల్లుతున్నాయని, ఆ పార్టీలు ముస్లింలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ఒకటో తేదీన జీతాలిచ్చే పరిస్థితి లేదని, అప్పులపాలైన రాష్ట్రాన్ని కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎట్లా గట్టెక్కిస్తాయో చెప్పాలని ప్రశ్నించారు. వేములవాడలో బీజేపీ అబ్యర్థి వికాస్ రావును గెలిపిస్తే రాజరాజేశ్వర ఆలయాన్ని కాశి తరహాలో అబ్బురపరిచేలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. #bandi-sanjay #telangana-elections-2023 #bjp-telangana మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి