/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-15-jpg.webp)
Bandi Sanjay: అవినీతి ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెప్పారని బీజేపీ (BJP) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. బీఆర్‌ఎస్ ఓటమి సంతోషాన్నిచ్చిందన్నారు. కరీంనగర్‌లో తన ఓటమే లక్ష్యంగా ఓ వర్గం తీవ్రంగా పనిచేసిందన్నారు. పదేళ్ల పాలనలో బీఆర్‌ఎస్ (BRS) తీవ్రమైన అవినీతికి పాల్పడిందని, వక్ఫ్ బోర్డు భూములను కబ్జా చేసిందని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా తాను పనిచేస్తానన్నారు. రాష్ట్రంలో పార్టీని పటిష్ట పరచడమే తమ లక్ష్యమని స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి: వీరంతా పార్టీ మారి ఓటమి పాలయ్యారు!