/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Bandh-of-drug-parties-in-the-vicinity-of-coal-mines.jpg)
క్రమశిక్షణ చర్యలు
సింగరేణి బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్ల​ఆవరణల్లో మందు పార్టీలు చేసుకోవద్దంటూ శ్రీరాంపూర్​ ఏరియా సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్​ జారీ చేసింది. ఎగ్జిక్యూటివ్‌లతో సహా కొందరు ఉద్యోగులు మందు పార్టీలు చేసుకుంటున్నారని ఇది దుష్ప్రవర్తన కిందకు వస్తుందని పేర్కొంది. గనులు, డిపార్ట్​మెంట్ల పరిసరాల్లో మందు పార్టీలు చేసుకుంటే క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
సర్క్యూలర్​ జారీ
బొగ్గు గనులు, డిపార్ట్​మెంట్లపై ఉన్న మైసమ్మ తల్లి ఆలయంలో కోళ్లు, మేకలు కోసి, ఉద్యోగులు సామూహిక విందు చేసుకోవడం, మందు తాగడం ఆనవాయితీగా వస్తుందని టీబీజీకేఎస్​ కేంద్ర కమిటీ వైస్​ ప్రెసిడెంట్​ డీకొండ అన్నయ్య, శ్రీరాంపూర్​ ఏరియా బీఎంఎస్ సెక్రటరీ నాతాడి శ్రీధర్​రెడ్డి అన్నారు. పూజా కార్యక్రమాలను నిర్వహించవద్దని సింగరేణి యాజమాన్యం సర్క్యూలర్​ చేయడం వారి మనోభావాలను దెబ్బతీయడమేని, వెంటనే సర్క్యూలర్​ను ఉపసహంరించుకోవాలని డిమాండ్​ చేశారు.