Ban on Tea: ఇష్టంగా టీ తాగుతున్నారా? అది కష్టాన్ని తేవచ్చు.. క్యాన్సర్ కారణం కావచ్చు!!

టీ తాగందే కొంతమందికి పూట గడవదు. అయితే, మనం తాగే టీ లో కృత్రిమ రంగులు, రసాయనాలతో పాటు రంపపు పొట్టు కూడా మిళితమై ఉంటోందనీ.. ఇవి క్యాన్సర్ తీసుకువస్తాయని కర్ణాటక ఫుడ్ అండ్ సేఫ్టీ విభాగం చెబుతోంది. వారి పరిశోధనల్లో టీ పొడిలో అనారోగ్యకారక పదార్ధాలు కలుస్తున్నాయని తేలింది. 

Ban on Tea: ఇష్టంగా టీ తాగుతున్నారా? అది కష్టాన్ని తేవచ్చు.. క్యాన్సర్ కారణం కావచ్చు!!
New Update

Ban on Tea:  ఇటీవల కాలంలో ఆహార పదార్ధాల విషయంలో చాలా షాకింగ్ వార్తలు తెలుస్తున్నాయి. జంక్ ఫుడ్ లో కలుస్తున్న వివిధ రకాల రసాయనాలు.. రంగులు మన ఆరోగ్యానికి హాని చేస్తాయని.. క్యాన్సర్ మోసుకువస్తాయని ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరికలు జరీ చేశారు. అదేసమయంలో కర్ణాటకలో జరిపిన పరిశోధనల్లో గోబీ మంచూరియా, కాటన్ క్యాండీ, నాన్ వెజ్ కబాబ్ లు, అమ్మాయిల హాట్ ఫేవరెట్ పానీపూరీ వంటి ఆహార పదార్ధాల వల్ల ఆరోగ్యం నాశనం అయిపోతుందని తేల్చారు. దీంతో ఆయా పదార్ధాలపై నిషేధాన్ని విధించారు. దీంతో దేశవ్యాప్తంగా కలకలం రేగింది. అనేక రాష్ట్రాలు ఈ విషయంపై దృష్టి సారించాయి. హైదరాబాద్ తో పాటు తెలంగాణ అంతటా కూడా ఇటీవల ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు వివిధ ప్రాంతాల్లో దాడులు చేసి ఆహారపదార్ధాలలో జరుగుతున్న కల్తీని వెలుగులోకి తీసుకువచ్చారు. 

ఇప్పుడు కర్ణాటక నుంచి మరో షాకింగ్ నిర్ణయం వెలువడింది. అదేమిటంటే.. టీ పొడిలో కృత్రిమ రంగులు, రసాయనాలు కలగలుస్తున్నాయని అక్కడి ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. దీంతో అటువంటి టీ పొడిపై నిషేధం విధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. టీ పొడిలో కృత్రిమ రంగులు, రసాయనాలను నిషేధిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఇక దానిని అమలులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. 

బెంగళూరు సహా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి టీ పొడి నమూనాలను సేకరించారు. బెంగళూరులో సేకరించిన 49 టీ పొడి నమూనాల్లో 45 టీ పొడి నమూనాలు సురక్షితంగా లేవని తేలింది. ప్రధానంగా టీపొడి తయారీకి ఉపయోగించే పదార్థాల్లో టీపొడి రంగును పెంచేందుకు రసాయన రంగులు వాడినట్లు తనిఖీల్లో తేలింది.

Ban on Tea:  కొన్ని రోడ్డు పక్కనే ఉన్న టీ దుకాణాలు బరువు పెంచేందుకు టీ పొడిలో కొంత రంపపు పొడిని కూడా వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఇందులో క్యాన్సర్ కారకాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. అందుకే టీ పొడిలో వాడే క్యాన్సర్ కారకాలను త్వరలో నిషేధించాలని ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ విభాగం నిర్ణయించింది.

ప్రస్తుతం టీ వినియోగం ఎక్కువగా ఉన్న ఉత్తర కర్ణాటకలోని వివిధ జిల్లాల్లో 48 నమూనాలను సేకరించారు. బాగల్‌కోట్, బీదర్, గదగ్, ధార్వాడ, హుబ్బళ్లి, విజయనగరం, కొప్పల్, బళ్లారి వంటి జిల్లాల్లో పెద్ద మొత్తంలో పురుగుమందులు వాడుతున్నారని, ఇవి పెద్ద ఆరోగ్య ప్రమాదాలకు దారితీస్తాయని ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు గుర్తించారు.

#karnataka #tea
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe