Ban Paytm : మనమందరం ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్(Digital Payments) కి బాగా అలవాటు పడిపోయాం. మొబైల్ లోనే పేమెంట్స్ చేసేస్తున్నాం.. బ్యాంక్ నుంచి బ్యాంక్ కి.. మన ఎకౌంట్ నుంచి ఇతర ఎకౌంట్స్ లోకి.. మన ఎకౌంట్స్ నుంచి వ్యాపారుల ఎకౌంట్స్ కి డబ్బును మొబైల్ ఫోన్ లో రెండు క్లిక్స్ ద్వారా పంపించేస్తున్నాం. రిసీవ్ చేసుకుంటున్నాం. ఈవిధంగా చేయడంలో మనల్ని బాగా ఎంకరేజ్ చేసిన సంస్థల్లో Paytm ఒకటి. మనలో చాలామందికి Paytm ఎకౌంట్స్ ఉన్నాయి. అలాగే Paytm నుంచి FaSTag.. Paytm వాలెట్.. Paytm బ్యాంక్ లో ఎకౌంట్స్ కూడా అందరికీ ఉన్నాయి. అయితే, ఇప్ప్పుడు Paytm కస్టమర్లకు కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. అది ఏమిటంటే.. Paytm పై ఆర్బీఐ బ్యాన్ విధించింది అనే వార్త.
Ban on Paytm : అవును ఇది నిజమే. భారతీయ రిజర్వ్ బ్యాంక్ అంటే ఆర్బీఐ Paytm బ్యాంకింగ్ విభాగం Paytm పేమెంట్స్ బ్యాంక్(PPBL) పై నిషేధం విధించింది. నిబంధనలను పాటించడంలో Paytm పేమెంట్స్ బ్యాంక్ పదే పదే విఫలం కాకపోవడంతో ఈ చర్యలు తీసుకుంది ఆర్బీఐ. ఆర్బీఐ Paytmకి ఇచ్చిన నోటీసు ప్రకారం వెంటనే కొత్త కస్టమర్లను చేర్చుకోవడం మానేయాలి. అలాగే, ఈనెల 29 నుంచి ఇప్పటికే ఉన్న కస్టమర్ల నుంచి డిపాజిట్లు తీసుకోవడం ఆపేయాలి. అంటే ఫిబ్రవరి 29 తర్వాత, Paytm పేమెంట్ బ్యాంక్ బ్యాంకింగ్ సేవలను అందించదు. ఇదే కాకుండా Paytm సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, కరెంట్ ఖాతాలు, ప్రీపెయిడ్ సాధనాలు, ఫాస్ట్‌ట్యాగ్‌లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్ మొదలైనవి ఏదైనా సరే, వీటిలోని బ్యాలెన్స్‌ని ఉపసంహరించుకోవడం లేదా ఉపయోగించడం ఎలాంటి పరిమితి లేకుండా ఉపయోగించుకోవచ్చు.
ఇప్పుడు Paytm వాడుతున్న అందరికీ చాలా అనుమానాలు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం..
Paytm ద్వారా పొందిన వ్యాపారుల పరిస్థితి ఏమిటి?
Paytm పేమెంట్స్ బ్యాంక్ ఎకౌంట్ లో డబ్బును స్వీకరించిన వారు - ఈ ఖాతాలలోకి తాజా క్రెడిట్ పర్మిట్ చేయరు. అందువల్ల పేమెంట్స్ ఆమోదించలేరు. అంటే ఫిబ్రవరి 29 తరువాత Paytm స్టిక్కర్స్ పనిచేయవు. వ్యాపారాలు వేరే డిజిటల్ స్టిక్కర్స్ కి మరవలసి ఉంటుంది.
మన వాలెట్ బ్యాలెన్స్..
వాలెట్ బ్యాలెన్స్‌ని తిరిగి మన బ్యాంక్ ఎకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చేసుకోవడం మంచిది లేదా మన బ్యాలెన్స్ అయిపోయే వరకు ఎలక్ట్రిక్ లేదా ఫోన్ బిల్లులు చెల్లించడం ద్వారా అక్కడ ఉన్న ఫండ్స్ ఉపయోగించుకోవచ్చు. ఏది ఏమైనా వీలైనంత వరకూ వాలెట్ బ్యాలెన్స్ ఖర్చు చేసేయడం మంచిది.
ఆహారం, ఇంధనం వంటి సబ్-వాలెట్లు..
మెట్రోలలో ఉపయోగించే NCMC (నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు) ఆహారం, ఇంధన వాలెట్‌లతో సహా ఏదైనా ప్రీపెయిడ్ సాధనాల్లోకి Paytm ఫండ్స్ తీసుకోకుండా RBI నిషేధించింది. ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్‌ని ఉపయోగించగలిగినప్పటికీ, ఫిబ్రవరి 29 తర్వాత ఎలాంటి తాజా ఫండ్స్ యాడ్ చేయలేము. ఇప్పటికే ఆ కార్డులలో ఉన్న బ్యాలెన్స్ క్లియర్ చేసుకోవడం మంచిది.
Also Read: Budget 2024 Live Updates🔴: మధ్యంతర బడ్జెట్‌లో ప్రజలను ఆకర్షించే పథకాలు!
Paytm - FaSTag ఉంటే ఏమి చేయాలి?
Paytm FaSTag ఉపయోగించేవారు.. ఇతర ఫాస్టాగ్ సర్వీసులకు మారాలి. కొత్త ట్యాగ్‌ని కొనుగోలు చేయాలి.
Paytm ద్వారా తీసుకున్నలోన్స్..
ఈ లోన్స్ థర్డ్-పార్టీ లెండర్స్ ఇచ్చినవి. వీటిని తీసుకున్న వారు ఆ థర్డ్ పార్టీ లెండర్స్ కు నేరుగా తమ రీపేమెంట్‌లను కొనసాగించవలసి ఉంటుంది. అలా తిరిగి చెల్లించడంలో వైఫల్యం లేదా ఏదైనా ఆలస్యం వారి క్రెడిట్ స్కోర్‌పై ప్రభావం చూపుతుంది.
స్టాక్, మ్యూచువల్ ఫండ్ ల పరిస్థితి..
వీటిని సెబీ నియంత్రిస్తుంది. ఇవి RBI ఆర్డర్ పరిధిలోకి రావు. ఆర్‌బీఐ యాక్షన్ తర్వాత సెబీ తమ కార్యకలాపాలను సమీక్షిస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు.
Paytm గేట్‌వే..
కొన్ని పెద్ద ప్రభుత్వ ప్లాట్‌ఫారమ్‌లు వేర్వేరు పేమెంట్ గేట్‌వేలను కలిగి ఉంటాయి. కాబట్టి వాటితో ఇబ్బంది ఉండదు. కానీ చిన్న ఎంటిటీలు వేరే గేట్‌వేలకు మారాల్సి రావచ్చు.
ఆర్బీఐ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికే Paytm సర్వీసుల్లో బ్యాలెన్స్ ఉన్నవారికి ఎటువంటి ఇబ్బందీ లేదు. వారు తమ బ్యాలెన్స్ అయిపోయేవరకూ కొనసాగించవచ్చు. అందువల్ల పెద్దగా టెన్షన్ పడే పని ఏమీ లేదు. నిదానంగా Paytm సర్వీసుల్లో ఉన్న మీ బ్యాలెన్స్ లను ఖర్చు చేయడం లేదా అవకాశం ఉంటె మీ బ్యాంక్ ఎకౌంట్ కి ట్రాన్స్ ఫర్ చేసుకోవడం చేయవచ్చు.
Watch this interesting Video :