/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/Balkampet-BJRnagar-stabbing-commotion.jpg)
పాత కక్షలతో దాడి
హైదరాబాద్‌లోని బల్కంపేట బీజేఆర్ నగర్‌లో కత్తిపోట్ల ఘటన కలకలం సృష్టించింది. పాత కక్షల నేపథ్యంలో ఓ యువకుడు ముగ్గురిపై కత్తితో దాడిచేశాడు. ఈ దాడిలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించి.. వారిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవల నగరంలో కత్తిపోట్ల ఘటనలు రోజురోజుకూ పెరిగిపోతున్నారు.
అయితే.. ఈనెల 20న బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ ఉత్సవం అనంతరం ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఎంతోమంది భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. మరో వైపు మందుబాబులు, జేబుదొంగలు రెచ్చిపోయారు. అర్ధరాత్రి దాటాక ఆలయ ప్రాంగణంలోని జరిగిన గొడవల్లో ఐదుగురు కత్తిపోట్లకు గురయ్యారు. ఈ ఘటన మరువకముందే మరోసారి కత్తిపోట్ల ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.