Train Accidents: 5 నెలలు.. 3 ఘోర రైళ్ల ప్రమాదాలు.. కారణం మాత్రం ఒక్కటే!

నిర్లక్ష్యానికి వందలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. జూన్‌లో జరిగిన ఒడిశా రైళ్ల ప్రమాదం నుంచి నిన్న జరిగిన విజయనగరం రెండు రైళ్ల ఢీకొన్న ప్రమాదం వరకు అడుగుఅడుగునా అధికారుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈ అక్టోబర్ 11న జరిగిన బీహార్‌ ట్రైన్‌ యాక్సిడెంట్‌లోనూ రైల్వే ఇంజినీరింగ్ విభాగం నిర్లక్ష్యం ఉందని తేలింది. ఒడిశా ఘటనలో 296మంది, బీహార్ ఘటనలో నలుగురు, విజయనగరం ఘటనలో ఇప్పటివరకు 14మంది ప్రాణాలు విడిచారు.

Train Accidents: 5 నెలలు.. 3 ఘోర రైళ్ల ప్రమాదాలు.. కారణం మాత్రం ఒక్కటే!
New Update

ఒకసారి చేస్తే పొరపాటు.. రెండు సార్లు తప్పు.. మూడో సారి చేస్తే నేరం.. పదేపదే అదే చేస్తే ఘోరం..! అవే ఘోరాలు అదేపనిగా జరిగితే వందలాది బతుకులు బూడిదవుతాయి.. వేలాది జీవితాలు చికట్లో మగ్గిపోతాయి. దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాలకైనా, రైళ్ల ప్రమాదాలకైనా ప్రధాన కారణం ఒక్కట్టే. అదే నిర్లక్ష్యం. అధికారుల నిర్లక్ష్యం, ఏం జరుగుతుందిలేనన్న అలసత్వం. గత జూన్‌లో జరిగిన బాలాసోర్‌ రైళ్ల ప్రమాదానికైనా, నిన్న జరిగిన విజయనగరం ట్రైన్‌ యాక్సిడెంట్‌కైనా, ఈ మధ్యలో జరిగిన బీహార్‌ ఘటనకైనా మూలం నిర్లక్ష్యమే. సాంకేతిక లోపాలు, టెక్నాలజీ ఒక సాకు మాత్రమే. ఘటన జరిగిన అధికారులు వందల కారణాలు చెప్పవచ్చు.. కానీ చనిపోయిన వారిని తిరిగి తీసుకురాలేరు కదా..! యాక్సిడెంట్లు జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలి కానీ.. జరిగిపోయిన తర్వాత కారణాలు చెప్పడం కాదు. 1981లో జరిగిన భాగమతి రివర్‌ ట్రైన్‌ ప్రమాదం నుంచి విజయనగరం ప్రమాదం వరుకు ఇండియాల్లో వందల్లో రైళ్ల ప్రమాదాలు జరిగాయి. పదేపదే అవే ఘటనలు జరుగుతున్నా.. ఇప్పటికీ పాత సాకులే చెబుతుండడం బాధాకరం!

గడచిన ఐదు నెలల్లో మూడు ఘోర రైళ్ల ప్రమాదాలు జరిగియి:

publive-image ఒడిశా ట్రైన్ యాక్సిడెంట్ (FILE)

జూన్ 2, 2023 ఒడిశా ట్రైన్‌ యాక్సిడెంట్:
నిజానికి గతంతో పోల్చితే పదేళ్లుగా రైళ్ల ప్రమాదాల సంఖ్య తగ్గిందనే చెప్పాలి. ఒకవేళ ప్రమాదాలు జరిగినా మరణనష్టం కాస్త తక్కువగానే ఉండే పరిస్థితులు వచ్చాయి. 2016 నవంబర్‌లో ఇండోర్-రాజేంద్ర నగర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ ప్రమాదంలో 152 మంది మరణించిన తర్వాత ఆ స్థాయిలో మరోసారి ట్రైన్‌ యాక్సిడెంట్ జరగలేదు. అయితే ఈ ఏడాది జూన్‌2న ఒడిశాలో జరిగిన రైళ్ల ప్రమాదం దేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. బాలాసోర్ జిల్లాలో గంటకు 128కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోన్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ఓ గూడ్స్‌ రైలును ఢీకొట్టింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న బెంగుళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌ను కోరమాండల్‌ ట్రైన్‌ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20కి పైగా కోచ్‌లు పట్టాలు తప్పాయి. మొత్తం మూడు రైళ్లకు చెందిన బోగీలకు ఈ ప్రమాదంలో నుజ్జునుజ్జు అయ్యాయి. వేలాది కుటుంబాలను అంధకారంలోకి నెట్టిన ఈ ప్రమాదం మొత్తంగా 296 మందిని బలితీసుకుంది. గాయపడ్డ వారి సంఖ్య అధికారికంగా 1,200 దాటింది.

publive-image బీహార్ యాక్సిడెంట్ (FILE)

అక్టోబర్ 11, 2023 బీహార్‌ ట్రైన్ యాక్సిడెంట్:
ఇక ఈ నెల(అక్టోబర్‌)లోనే బీహార్‌లో మరో ట్రైన్‌ ప్రమాదం జరిగింది. బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో నార్త్-ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు అకస్మాత్తుగా పట్టాలు తప్పింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 100లాది మంది గాయపడ్డారు. ట్రాక్‌లోని లోపం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తేలింది. ఈ లోపానికి రైల్వే ఇంజినీరింగ్ విభాగమే బాధ్యులంటూ నివేదిక స్పష్టం చేశాయి. ఈ ప్రమాదం తర్వాత పలు రైళ్ల సర్వీసులను కొన్నిరోజులపాటు రైల్వేశాఖ రద్దు చేసింది. పలు సర్వీసులను దారి మళ్లించింది. ఈ ప్రమాదం కారణంగా రైల్వేకు రూ.52.1 కోట్ల నష్టం వాటిల్లింది.

publive-image విజయనగరం ట్రైన్ యాక్సిడెంట్ (FILE)

అక్టోబర్ 30, విజయనగరం:
ఏపీలోని విజయనగరం జిల్లాలో అక్టోబర్‌ 29 రాత్రి 7 గంటల 10 నిమిషాలకు రెండు రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. విశాఖపట్నం నుంచి 40 కిలోమీటర్ల దూరంలోని కంటకపల్లి వద్ద రాయగడ ప్యాసింజర్ రైలును పలాస ప్యాసింజర్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు కోచ్‌లు పట్టాలు తప్పాయి. ఇప్పటివరకు 14 మంది మరణించగా.. వారిలో ఏడుగురిని గుర్తించారు అధికారులు. మృతదేహాలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. మరోవైపు మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్యాసింజర్ రైలు సిగ్నల్ కోసం కొత్తవలస మండలం అలమండ, కంటకాపల్లి వద్ద పట్టాలపై ఆగి ఉంది. అదే లైనులో వెనుకే వచ్చిన విశాఖ- రాయగడ రైలు పలాస వెళ్తున్న రైలును ఢీకొట్టింది. మొదట పట్టాలు తప్పిన రైలును మరో రైలు ఢీకొట్టినట్లు అధికారులు భావించారు. కానీ సిగ్నల్ కోసం వేచి ఉన్న పలాసకు వెళ్తున్న రైలును విశాఖ నుంచి రాయగడ వెళ్తున్న రైలు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఇలా మూడు నెలల్లో 5 ఘోర రైళ్ల ప్రమాదాలు జరిగాయి. ఈ ప్రమాదాలకు కవచ్‌ సిస్టమ్‌ లేదని..మానవ తప్పిదమని.. సాంకేతిక లోపం అని రకరకాల కారణాలు వినిపిస్తున్నా.. వాటన్నిటికీ మూలం మాత్రం నిర్లక్ష్యమే..!

Also Read: అది తట్టుకోలేకే క్రిస్టియన్ సంస్థపై బాంబు దాడి.. నిందితుడి వీడియో వైరల్ .!

#vizianagaram-train-accident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe