Vizianagaram Train Accident:రాయగడ-పలాస రైలు ప్రమాదానికి కూడా కారణం కవచ్ సిస్టమే లేకపోవడమే.
విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. టెక్నాలజీ ఇంతలా డెవలప్ అయింది...వందే భారత్ లాంటి స్పీడ్ ట్రైన్లను నడిపిస్తున్నాము. అయినా కూడా యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదం.. ఈ ఏడాది జూన్‌లో ఒడిశాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాదంలాగే అనిపిస్తోంది. మరి ఆ ప్రమాదం నుంచి రైల్వే అధికారులు పాఠాలు నేర్చుకోలేదా? అయినా కూడా మళ్ళీ ఎందుకు యాక్సిడెంట్ జరిగింది అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రైల్వేస్ పెట్టిన కవచ్ సిస్టమ్ ఏమైందని అడుగుతున్నారు.