Balakrishna Ordered to Remove NTR Flex: నందమూరి వారసుల్లో కొన్నేళ్ళు విభేధాలుఉన్నాయి. బాలకృష్ణ అండ్ కో ఒకవైపు, జూ. ఎన్టీయర్ అండ్ ఇంకో వైపుగా గొడవలు జరగుతున్నాయి. పైకి ఏమీ లేనట్టుగా ఉంటూనే లోపల్లోపల మాత్రం ఒకరంటే ఒకరికి పడకుండా ఉంటోంది. కొన్ని కొన్ని సందర్భాల్లో ఇది బయట కూడా పడుతోంది. ఇప్పుడు మళ్ళీ ఇవాళ ఎన్టీయార్ వర్ధంతి రోజున (NTR Death Anniversary) ఈ గొడవలు మరొకసారి బయట పడ్డాయి.
అసలేం జరిగిందంటే...
ఈరోజు ఎన్టీయార్ వర్ధంతి అవ్వడంతో కుటుంబ సభ్యులు అందరూ ఎన్టీయార్ ఘాట్ (NTR Ghat) దగ్గర నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీయార్ ఘాట్ దగ్గర బాలకృష్ణ, జూ. ఎన్టీయార్ ఇద్దరి ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడకు ముందు జూ.ఎన్టీయర్ (Jr NTR), కల్యాణ్ రామ్ వచ్చి వెళ్ళారు. తరువాత బాలకృష్ణ, రామకృష్ణ తదితరులు వచ్చి నివాళులర్పించి వెళ్ళారు. అయితే అలా వచ్చినప్పుడు ఇద్దరూ ప్రత్యక్షంగా గొడవ పడినట్టు కనిపించలేదు కానీ.. ఎన్టీయార్ ఘాట్ దగ్గర జూ.ఎన్టీయార్ ఫ్లెక్సీలను చూసి బాలకృష్ణ కోసంతో మండిపోయారుట. వెంటనే ఆ ఫ్లెక్సీలను తీసేయాలని చెప్పారు. దీంతో అక్కడున్న సిబ్బంది వాటిని తొలగించారు కూడా. అయితే ఈ చర్యపై జూ.ఎన్టీయార్ అభిమానులు ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఈడీ విచారణకు ఈసారి కూడా కేజ్రీవాల్ డౌటే..
చంద్రబాబు అరెస్ట్ అప్పుడు కూడా...
ఇంతకుముందు కూడా ఇలాంటివి విభేదాలు రెండు మూడు సార్లు బయటపడ్డాయి. చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడుకూడా జూ.ఎన్టీయార్ మూనంగా ఉండిపోవడం గొడవకు దారి తీసింది. అప్పుడు కనీసం ఒక్కసారి అయినా చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించకపోవడం మీద నందమూరి, నారా రెండూ కుటుంబాలకు షాక్ తగిలినట్టు అయింది. దీని మీద బాలకృష్ణ (Balakrishna) బహిరంగంగానే ఐ డోంట్ కేర్ అంటూ ఫైర్ కూడా అయ్యారు. అయినా కూడా ఎన్టీయార్ మూసంగాను ఉండిపోయారు. చంద్రబాబు విడుదల అయిన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఇప్పుడు ఎన్టీయార్ ఘాట్ దగ్గర జరిగిన తతంగంతో వారిద్దరి మధ్యా మరింత దూరం పెరిగిందని అంటున్నారు ఇరు హీరోల అభిమానులు.