Bala Krishna: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా..!! బాలకృష్ణ హాట్ కామెంట్స్‌..!

శ్రీలీలతో సినిమా చేస్తానన్న బాలకృష్ణకు మోక్షజ్ఞ గట్టి వార్నింగ్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ ఫైర్ అయ్యారు. నేను హీరోగా రాబోతుంటే శ్రీలీలతో హీరోగా చేస్తావా అని బాలకృష్ణను మోక్షజ్ఞ తిట్టాడట.! భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

Bala Krishna: గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా..!! బాలకృష్ణ హాట్ కామెంట్స్‌..!
New Update

Bala Krishna:  శ్రీలీల (Sreeleela)తో సినిమా చేస్తానన్న బాలకృష్ణకు మోక్షజ్ఞ గట్టి వార్నింగ్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా అంటూ ఫైర్ అయ్యారు. నేను హీరోగా రాబోతుంటే శ్రీలీలతో హీరోగా చేస్తావా అని బాలకృష్ణను మోక్షజ్ఞ (Mokshagna) తిట్టాడట.! భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ వేడుకలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు తెగ వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి ట్రైలర్ రిలీజ్ (Bhagavanth Kesari Trailer) వేడుక కోసం నందమూరి బాలయ్య వరంగల్ వచ్చారు. ఈ వేదికపై మాట్లాడుతూ.. ఈ సినిమాలో శ్రీలీల తన కుమార్తెగా నటించిందని చెప్పారు. తర్వాతి సినిమాలో హీరోహీరోయిన్లుగా చేద్దామని శ్రీలీలతో చెప్పానని వివరించారు. ఇదే విషయాన్ని ఇంట్లో చెప్పగా.. మోక్షజ్ఞ తనపై ఫైర్ అయ్యాని బాలకృష్ణ తెలిపారు.  ‘ఓవైపు నేను హీరోగా ఎంట్రీ ఇవ్వాలని చూస్తుంటే ఆమెకు ఆఫర్ ఇస్తావా.. గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా?’ అని మోక్షజ్ఞ తిట్టినట్లు తెలిపారు. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

నందమూరి బాలకృష్ణ చెప్పే మాస్ డైలాగ్స్‌కు ఉండే క్రేజ్ అందరికీ తెలిసిందే. బాలయ్య డైలాగ్స్ చెబితే థియేటర్లు దద్దరిల్లిపోవాల్సిందే. అలాంటి మాస్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌తో భగవంత్ కేసరి దుమ్ములేపేందుకు రెడీ అయ్యాడు. ఈ మూవీని అనిల్ రావిపూడి మరింత మాసీగా తీసినట్టు కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్ చూస్తుంటే బాలయ్యను కొత్త కోణంలో చూపించినట్టుగా అనిపిస్తోంది. బాలయ్య పాట పాడితే వచ్చిన ట్రోలింగ్ మీద ఇప్పుడు భగవంత్ కేసరి సినిమాలో సెటైర్లు వేసినట్టుగా కనిపిస్తోంది.

కాగా, నందమూరి మోక్షజ్ఞ సినిమాల్లోకి వస్తారని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. బాలయ్య అభిమానులు కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2017లోనే మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తారని బాలకృష్ణ స్వయంగా వెల్లడించారు. అయినా ఇప్పటి వరకూ మోక్షజ్ఞ సినిమాల్లోకి రాలేదు. బాలయ్య తాజా కామెంట్లతో మోక్షజ్ఞ త్వరలోనే సినిమాల్లోకి వస్తాడని తేలిపోయింది. ఈ దిశగా మోక్షజ్ఞ కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. ముందుగా అతిథి పాత్రలో నటించి ఆపై సోలో హీరోగా ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది.

Also Read: అభిమానికి మాస్ కౌంటర్‌ ఇచ్చిన బాలీవుడ్ బిగ్ బి..!

#balakrishna-comments #mokshagna #bala-krishna #sreeleela #bhagavanth-kesari-trailer #balakrishna-new-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe