ఎన్‌ఎస్‌యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్‌కు బెయిల్

అనుమతులు లేకుండా అడ్మిషన్లు చేపట్టిన గురునానక్ యూనివర్సిటీ యాజమాన్యంపై ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

New Update
ఎన్‌ఎస్‌యుఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్‌కు బెయిల్

Bail for NSUI President Balmuri Venkat
జైల్ నుంచి బయటపడ్డారు

ఇబ్రహీంపట్నం గురునానక్ యూనిర్సిటీ దగ్గర ఆందోళన చేపట్టిన క్రమంలో అరెస్ట్ అయిన ఎన్ఎస్‌యూఐ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్‌కు బెయిల్ ఇచ్చారు. ఈరోజు ఉదయం ఇబ్రహీంపట్నం జడ్జి నివాసంలో పోలీసులు ఎన్ఎస్‌యూఐ నేతలను ప్రవేశపెట్టారు. ఈక్రమంలో జడ్జి అతనికి షూరిటీలతో కూడిన బెయిల్‌ను మంజూరు చేశారు.

30వేల చొప్పున రెండు షూరిటీలు

ఒక్కొక్కరికి రూ. 30వేల చొప్పున 2 షూరిటీల ఇవ్వాలని ఆదేశించారు. అయితే బలమూరి వెంకట్‌తో పాటు ఎన్ఎన్‌యూఐ నేతలు కార్తీక్ పటేల్ నందకిషోర్, శివ , యాదయ్యలకు బెయిల్ మంజూరైంది. ఇక గురువారం ఇబ్రహీంపట్నం గురునానక్ యూనివర్సిటీ వద్ద ఆందోళన చేపట్టారు ఎన్ఎస్‌యూఐ నేతలు. ఎలాంటి పర్మిషన్స్ లేకుండానే యూనివర్సిటీ పేరుతో అడ్మిషన్లు చేపట్టారంటూ ఆందోళన చేశారు.

గురునానక్ యూనివర్సిటీ యాజమాన్యం తీరుతో 4000 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైందంటూ వారి తల్లిదండ్రులతో కలిసి ఎన్ఎస్‌యూఐ ఆందోళనకు దిగింది. ఇక పోలీసులు ఎన్ఎస్‌యూఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తోపాటు మిగతా వారిని అరెస్టు చేసి మాడ్గుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు