Rape case: బట్టలు విప్పి, ప్రైవేట్ పార్ట్ టచ్ చేస్తూ.. బాలికల అత్యాచార ఘటనలో షాకింగ్ నిజాలు! బద్లాపూర్ ప్రైవేట్ స్కూల్ చిన్నారుల అత్యాచారం కేసులో భయంకర నిజాలు బయటకొచ్చాయి. నిందితుడు అక్షయ్ షిండే తమ బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్‌లను టచ్ చేశాడని బాధిత బాలికలు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. మరోవైపు సీఎం ఏక్‌నాథ్ షిండేకు వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపడుతున్నారు. By srinivas 20 Aug 2024 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి Badlapur: మహారాష్ట్ర బద్లాపూర్ చిన్నారులపై అత్యాచారం కేసులో షాకింగ్ నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. నాలుగేళ్ల వయసు ఉన్న ఇద్దరు చిన్నారులపై 23 ఏళ్ల స్వీపర్ అత్యాచారానికి పాల్పడ్డ విషయం తెలిసిందే. కాగా టాయిలెట్ లో తమ బట్టలు విప్పి ప్రైవేట్ పార్ట్‌లను టచ్ చేశాడని బాధిత బాలికలు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. ఇక ఈ కేసును మరింత సీరియస్ గా తీసుకున్న ప్రభుత్వం కేసును విచారించేందుకు సిట్ ఏర్పాటు చేసింది. మరోవైపు ఈ నెల 12న ప్రీ ప్రైమరీ స్కూల్‌లో ఘటనలో చిన్నారులపై అత్యాచారం జరిగినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనను నిరసిస్తూ మహారాష్ట్రలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. ఘటనాస్థలానికి సీఎం ఏక్‌నాథ్ షిండే వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్లు చేస్తున్నారు. అసలేం జరిగిందంటే.. బద్లాపూర్‌లోని ఓ ప్రైవేట్ స్కూల్ లో 23 ఏళ్ళ యువకుడు అక్షయ్ షిండే క్లీనింగ్ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఆగస్టు1 2024న షిండే కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించబడ్డాడు. ఇతను అక్కడ ప్రీ ప్రైమరీ చదువుతున్న విద్యార్థుల సహాయక సిబ్బందింగా, బాలికల టాయిలెట్లను శుభ్రపరిచే విధులను నిర్వహించేవాడు. ఈ క్రమంలో అక్షయ్ షిండే దారుణానికి ఒడిగట్టాడు. నాలుగేళ్ళ చిన్నారులను టాయిలెట్ కు తీసుకెళ్లే నెపంతో వారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. Protest in Badlapur- Adarsh School for sexually abusing 2 nursery kids one is of 4 years & other is of 5 years pic.twitter.com/osSQQEukpv — Manish Pangotra🇮🇳 (@ManishPangotra5) August 20, 2024 ప్రైవేట్ భాగాలలో నొప్పి ఉందని పాఠశాల నుంచి ఇంటికి తిరిగి వెళ్లిన ఓ చిన్నారి తల్లిదండ్రులకు చెప్పడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. ఆమె టాయిలెట్ ఉపయోగించడానికి వెళ్ళినప్పుడు ఆమె ప్రైవేట్ భాగాలను తాకినట్లు వారికి చెప్పింది. దీంతో షాక్‌కు గురైన తల్లిదండ్రులు అదే తరగతికి చెందిన మరో బాలిక తల్లిదండ్రులను విచారించారు. వారు కూడా తమ కూతురు స్కూల్ కు వెళ్లాలంటేనే భయపడుతోందని తెలిపారు. ఆ తరువాత తల్లిదండ్రులు బాలికలను స్థానిక వైద్యునితో పరీక్షించగా, వారిద్దరూ లైంగిక వేధింపులకు గురయ్యారని వెల్లడించారు. దీంతో ఆగ్రహం చెందిన తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా.. నిందితుడి పై POCSO చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే విచారణలో పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, బాలికల టాయిలెట్ విషయంలో మహిళా అటెండర్ నియమించకపోవడం వంటి విషయాలు బయటకు వచ్చాయి. Also Read : 120 గురుకుల పాఠశాలలు ప్రారంభిస్తాం.. భట్టీ కీలక ప్రకటన #girl-rape-case #badlapur-private-school మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి