Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్‌!

ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్‌ ప్రజా శాంతి పార్టీలో చేరారు. పార్టీ అధినేత కేఏ పాల్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బాబు మోహన్ వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున బరిలోకి దిగబోతున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు.

New Update
Babu Mohan: ప్రజాశాంతి పార్టీలో చేరిన బాబు మోహన్‌!

Babu Mohan: ప్రముఖ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్‌ (Former Minister Babu Mohan) ప్రజా శాంతి పార్టీ (Praja Shanthi Party)లో చేరారు. ఆయనకు ఆ పార్టీ అధినేత కేఏ పాల్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీ చేయనున్నట్లు కేఏ పాల్ ప్రకటించారు. టీడీపీ నుంచి రాజకీయ అరంగేట్రం చేసిన బాబు మోహన్.. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పని చేశారు. 2014లో టీడీపీని వీడి బీఆర్ఎస్ పార్టీలో చేరి.. ఆందోల్ నుంచి విజయం సాధించారు. 2018లో బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. కొన్ని రోజుల క్రితం బీజేపీకి రాజీనామా చేయగా ఈ రోజు ఆయన ప్రజాశాంతి పార్టీలో చేరారు.

పొమ్మనలేక పొగ పెట్టారు..
ఈ సందర్భంగా త్వరలోనే ప్రచారం ప్రారంభించి కచ్చితంగా విజయం సాధిస్తామని బాబు మోహన్ ధీమా వ్యక్తం చేశారు. అలాగే బీజేపీ నాయకత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. తనను వాడుకుని బీజేపీ పొమ్మనలేక పొగ పెడ్తోందన్నారు. ఆందోల్ నియోజకవర్గం నుంచి 2018, 2023లో బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన వరంగల్ ఎంపీ టికెట్‌ను ఆశించినప్పటికీ బీజేపీ నిరాకరించింది.

ఇది కూడా చదవండి: KCR: పార్టీ నుంచి వెళ్లిపోయేవారితో నష్టం లేదు.. కేసీఆర్

బీజేపీ చిచ్చు పెడుతోంది..
దీంతో అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. ఇదిలావుంటే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఆందోల్ టికెట్‌ను బాబుమోహన్ కుమారుడు ఉదయ్ మోహన్‌కు ఇవ్వాలని బీజేపీ భావించడంతో తమ కుటుంబంలో బీజేపీ చిచ్చు పెడుతోందని బాబు మోహన్ ఆరోపించారు. దీంతో ఆందోల్ టికెట్‌కు బాబూమోహన్‌కు కేటాయించగా ఆయన ఓడిపోయిన విషయం తెలిసిందే.

Advertisment
తాజా కథనాలు