Babu Mohan: వీల్‌చైర్‌పై వచ్చి నామినేషన్ వేసిన బాబు మోహన్

TG: ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు బాబు మోహన్. ఈరోజు వీల్‌చైర్‌లో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. కాగా ఇటీవల బీజేపీకి రాజీనామా చేసిన బాబు మోహన్ కేఏ పాల్ సమక్షంలో ప్రజాశాంతి పార్టీలో చేరిన విషయం తెలిసిందే.

New Update
Babu Mohan: వీల్‌చైర్‌పై వచ్చి నామినేషన్ వేసిన బాబు మోహన్

Babu Mohan Filed Nomination: లోక్ సభ ఎన్నికల నామినేషన్లకు ఈరోజు చివరి రోజు కావడంతో తెలంగాణలో భారీగా నామినేషన్స్ దాఖలు అయ్యాయి. ప్రజాశాంతి పార్టీ (Praja Shanti Party) అభ్యర్థిగా వరంగల్ (Warangal) నుంచి ఎంపీగా పోటీ చేయనున్నారు బాబు మోహన్, ఈరోజు వీల్‌చైర్ లో వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. వీల్ చైర్ లో వెళ్లి ఆయన నామినేషన్ వేయడంతో ఆయనకు ఏమైంది అనే చర్చ రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.

ALSO READ: హైదరాబాద్ సౌత్ జోన్ డీసీపీగా స్నేహా మెహ్రా

తెలంగాణ ఇంఛార్జిగా బాధ్యతలు..

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజాశాంతి పార్టీలో చేరిన మాజీ మంత్రి బాబూమోహన్‌(కు కీలక పదవీ ఇచ్చారు. ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబూమోహన్‌ను నియమించారు. రానున్న లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో ప్రజాశాంతి పోటీ చేస్తుందని కేఏ పాల్ తెలిపారు. తాను ఈసారి తెలంగాణలో పోటీ చేయట్లేదని తెలిపారు. ప్రజాశాంతి పార్టీ తొలి ఎంపీ అభ్యర్థిగా బాబూమోహన్ ను ప్రకటించారు కేఏ పాల్. కాగా వరంగల్ నుంచి ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా బాబుమోహన్ పార్లమెంట్ ఎన్నికల బరిలో ఉన్నారు. కాగా బాబు మోహన్ ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ప్రజాశాంతి పార్టీలో చేరి ఎవరి ఊహకు అందని ట్విస్ట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు