బాబోయ్‌.. వీడు మాములోడు కాదు.. ఫ్రీ టికెట్‌ కోసం బుర్ఖానే ధరించాడు

కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన తర్వాత వారు ఇచ్చిన పథకాలన్నీ ఒక్కొక్కటి అమలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేశారు. దీంతో రాష్ట్రానికి అధిక ఖర్చు వస్తుందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఆఫర్‌ కేవలం 20 కిలోమీటర్ల పరిమితి మేరకే ప్రయాణించాల్సి ఉంటుందని సీఎం సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు. మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం కోసం ఓ హిందూ వ్యక్తి ఏకంగా బుర్ఖా వేసుకొని మహిళ అవతారం ఎత్తిన ఉదంతం తాజాగా వెలుగుచూసింది.

New Update
 బాబోయ్‌.. వీడు మాములోడు కాదు.. ఫ్రీ టికెట్‌ కోసం బుర్ఖానే ధరించాడు

Baboy He is not ordinary..He wears Burkhane for free ticket

బుర్ఖా వేశాడు.. చిక్కాడు 

కర్ణాటక రాష్ట్రంలో మహిళలకు కల్పించిన ఉచిత బస్సు ప్రయాణం కోసం ఓ హిందూ వ్యక్తి ఏకంగా బుర్ఖా వేసుకొని మహిళ అవతారం ఎత్తిన ఉదంతం కర్ణాటక రాష్ట్రంలో తాజాగా వెలుగుచూసింది. కర్ణాటక ప్రభుత్వం శక్తి యోజన పథకం కింద మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చు. అయితే ఈ ఉచిత బస్సు పథకాన్ని పొందాలని ధార్వాడ్ జిల్లాకు చెందిన వీరభద్రయ్య అనే వ్యక్తి ఏకంగా బుర్ఖా వేసుకొని మహిళగా అవతారం ఎత్తాడు.

ఫ్రీ పథకం కోసం..ఆడ వేషం

మనిషి జీవితంలో శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు అన్నట్లు వీరభద్రయ్య సర్కారు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు టికెట్ పొందటానికి బుర్ఖా ధరించి, మహిళ పేరిట ఉన్న ఆధార్ కార్డు చేత్తో పట్టుకొని ధార్వాడ్ జిల్లా బస్టాప్‌లో ప్రయాణికులకు దర్శనమిచ్చారు. వీరభద్రయ్య బుర్ఖా ధరించి మహిళా వేషంలో బస్టాప్‌లో ఒంటరిగా కూర్చొని ఉండగా గమనించిన చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి అతన్ని ప్రశ్నించారు. తాను భిక్షాటన చేసేందుకే తాను బుర్ఖా ధరించి మహిళ వేషం వేశానని వీరభద్రయ్య సెలవీయడం కొసమెరుపు. అసలు విషయం ఆరా తీస్తే కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకోవడం కోసమే బుర్ఖా వేసుకొని ఆడ వేషం కట్టినట్లు వెల్లడైంది. ఇంకేముంది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది వీరభద్రయ్య వేషం.

ఓర్వలేక..పథకం విఫలమైందుకు ఫ్లాన్

కర్ణాటక కాంగ్రెస్  ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని తీసుకురావడం తెలిసిందే. ఈ స్కీమ్ కోసం కొందరు తాపత్రేయపడుతూ బుక్ అయ్యే విచిత్ర వైరల్ ఉదంతాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ప‌లు వాగ్దాలు చేసింది. మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పించ‌నున్న‌ట్లు ఆ పార్టీ త‌మ ఎజెండాలో పేర్కొన్న‌ది. దానిలో భాగంగానే శ‌క్తి యోజ‌న కింద ఆడ‌వాళ్ల‌కు ఫ్రీ బ‌స్సు ప్ర‌యాణం క‌ల్పిస్తున్నారు. జూన్ 11న కర్ణాటక ప్రభుత్వం మహిళల కోసం శక్తి యోజన పేరిట ఈ ఉచిత బస్సు సర్వీసు పథకం ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ప్రకటించిన 5 ముఖ్య వాగ్దానాల్లో ఇదీ ఒకటి. అయితే, తమ పథకం ప్రజాదరణ పొందుతుండటంతో ఓర్వలేని వారు సోషల్ మీడియాలో వీడియోలు, వార్తలను వైరల్ చేస్తూ పథకం విఫలమైందని చెప్పేందుకు ప్రయాసపడుతున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు