పాకిస్థాన్, ఇంగ్లండ్ మధ్య గురువారం టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే వర్షం కారణంగా ఇరు జట్ల మధ్య రెండు మ్యాచ్ లు రదైయాయి.దీంతో 4 మ్యాచ్ ల సిరీస్ లో కిస్థాన్ 0-1తో వెనుకంజలో ఉంది.ఈ మ్యాచ్ టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇరు జట్ల మధ్య ఇదే చివరి టీ20 మ్యాచ్.
విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు ఆడిన 117 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌ల్లో 4037 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో 4000 కంటే ఎక్కువ పరుగులు చేసిన ఏకైక ఆటగాడిగా కోహ్లీ పేరు నమోదు చేశాడు.అయితే గురువారం జరిగే మ్యాచ్ లో విరాట్ సరసన బాబర్ ఆజం కూడా చేరే అవకాశం ఉంది.
బాబర్ ఆజం ఇప్పటి వరకు ఆడిన 118 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో 3987 పరుగులు చేశాడు. అంటే కోహ్లీ కంటే 50 పరుగులు వెనుకబడి ఉన్నాడు. విరాట్ రికార్డును బద్దలు కొట్టాలంటే బాబర్‌కు 51 పరుగులు కావాలి. ఈ రోజు జరిగే మ్యాచ్ లో బాబార్ అర్థసెంచరీ నమోదు చేసి కోహ్లీ రికార్డ్ బద్దలు కొట్టాలని చూస్తున్నాడు. అయితే ఈ జాబితాలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకూడా ఉన్నాడు. అతను 151 మ్యాచ్‌లలో 3974 పరుగులు చేశాడు. విరాట్, బాబర్,తర్వాత మూడవ స్థానంలో రోహిత్ శర్మ ఉన్నాడు. జూన్ 2 నుండి ప్రారంభమయ్యే ప్రపంచ కప్‌లో ఈ ముగ్గురి మధ్య ఆసక్తికరమైన పోరు కనిపిస్తుంది.