AP: ఆ నా కొడుకులు దెం..యండి.. మున్సిపల్ అధికారులపై అయ్యన్న పాత్రుడు బూతు పురాణం: వీడియో

మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. ఆరిలోవలోని ఆర్ అండ్ బి రోడ్డు నాణ్యత లోపించిందంటూ మున్సిపల్ అధికారులను బూతులు తిట్టారు. కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు. ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ హంగామా చేశారు.

New Update
AP: ఆ నా కొడుకులు దెం..యండి.. మున్సిపల్ అధికారులపై అయ్యన్న పాత్రుడు బూతు పురాణం: వీడియో

Ayyannapatrudu: నర్సీపట్నం మున్సిపల్ అధికారులపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే అయ్యన్న పాత్రుడు మరోసారి రెచ్చిపోయారు. చెప్పరాని భాషలో అధికారులను బూతులు తిట్టారు. తమాషాలు చేస్తున్నారా అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కళ్ళు మూసుకుపోయి ఏడుస్తున్నారా నా కొడుకులు. ఇష్టం లేకపోతే దెం..యండి అంటూ పెద్దగా అరుస్తూ నానా హంగామా చేశారు. త్వరలో నేనే స్పీకర్ (Assembly Speaker) అవుతున్నా. మిమ్మల్ని అసెంబ్లీలో గంటలు కొద్ది నిలబెడతానంటూ వార్నింగ్ ఇచ్చిన వీడియో వైరల్ అవుతోంది.

ఆర్ అండ్ బి రోడ్డు రోడ్డు నాణ్యతపై..
ఈ మేరకు మంగళవారం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం (Narsipatnam) నియోజకవర్గంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో ఆర్ అండ్ బి రోడ్డు, మున్సిపాలిటీ ఆర్ ఎం బి రోడ్లను సంబంధిత ఉన్నతాధికారులతో కలిసి అయ్యన్న పాత్రడు (Ayyannapatrudu) పరిశీలించారు. ఈ సందర్భంగా రోడ్డు నాణ్యత పరిణామాలకై, క్వాలిటీ అధికారుల వద్ద నుంచి స్పష్టమైన వివరణ రాకపోవడంతో అయ్యన్న అసహనం వ్యక్తం చేశారు. ఎలక్షన్లలో ఓట్ల కోసం అర్థరాత్రి రోడ్డు పనులు చేశారు కదా అంటూ ఆర్ అండ్ బి అధికారులు నిలదీశారు.

అందరినీ సస్పెండ్ చేస్తా..
ఈ పనులలో నాణ్యత లేనందున బిల్లులు చేయకూడదని ఆదేశించారు. 2017 సంవత్సరంలో తాను R&B మంత్రిగా ఉన్నప్పుడు గొలుగొండ మండలం కృష్ణదేవిపేట నుండి నర్సీపట్నం మార్గంలో 26 కిలోమీటర్లకు ఒక్కొక్క కిలోమీటర్ కు కోటి రూపాయలు చొప్పున నిధులు విడుదల చేసినట్లు చెప్పారు. ఆ నిధులతో ఏడు సంవత్సరాలుగా ఆర్ఎం బి రోడ్డు పనులు జరుగుతున్నాయి. ఈరోజు పరిశీలించగా నాణ్యత పాటించకుండా అసంపూర్ణంగా సాగుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పనులపై పూర్తి నివేదిక ఒక వారం రోజుల్లో ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఆ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎంక్వయిరీ నిర్వహించి, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేస్తానన్నారు. అంతేకాదు తాను అసెంబ్లీ స్పీకర్ గా చట్టసభలో నియమితులైన మరుక్షణమే సభాముఖంగా సంబంధించిన అధికారులు వివరణ ఇవ్వాల్సి వస్తుందని హెచ్చరించారు.

Also Read: బాత్రూంల్లో గోల్డ్‌ కలర్‌ షవర్లు, కళ్లుచెదిరే బెడ్స్‌.. రుషికొండ భవనం ప్రత్యేకతలివే!

Advertisment
Advertisment
తాజా కథనాలు