Anakapalle : 'కలెక్టర్ల కార్యాలయాలకు తాళాలు వేస్తాం'..మాజీ మంత్రి అయ్యన్న.!

జిల్లా కలెక్టర్లు జోక్యం చేసుకోని అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లలన్నారు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు. అంతేకానీ దౌర్జన్యంగా అంగన్వాడి సెంటర్ల తాళాలను పగలగొట్టే పనులు చేస్తే కలెక్టర్ల కార్యాలయాలకు తాళాలు వేస్తామని హెచ్చరించారు.

New Update
Ayyanna Patrudu: అయ్యన్నపాత్రుడికి ఈసీ షాక్.. చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు

Anakapalle : నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్టీఆర్ స్టేడియం(NTR Stadium) లో మహాత్మ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీ కార్యకర్తల నిరసన మూడవ రోజు కొనసాగుతోంది. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులతో కలిసి సంఘీభావాన్ని తెలిపారు టిడిపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. అంగన్వాడీలు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చేపట్టిన నిరసన కార్యక్రమం న్యాయమైనదేనని అయ్యన్న తెలిపారు.

Also Read : ‘సమ్మె బాటపై శాంతించని అంగన్వాడీలు..పట్టించుకోని ప్రభుత్వం’.!

పెరిగిన నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా అంగన్వాడీలకు ఇస్తున్న మెనూ బడ్జెట్ ను పెంచాలన్న ఆయన డిమాండ్ చేశారు. మూసి ఉన్న అంగన్వాడి సెంటర్ల తాళాలను పగలు కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని అంగన్వాడీలు తెలియజేయగా జిల్లా కలెక్టర్లు జోక్యం చేసుకొని మధ్య వర్తులుగా వ్యవహరించి అంగన్వాడీల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కరించాలని కోరారు.

Also Read : ఏంది వర్మా.. పవన్‌ను అంత మాట అనేశావ్.. ఫ్యాన్స్ రియాక్షన్ ఏంటో మరి..!

అలా కాకుండా దౌర్జన్యంగా అంగనవాడి సెంటర్ల తాళాలను పగుల కొట్టించడం వంటి పనులు చేస్తే అంగన్వాడి కార్యకర్తలు వర్కర్ల తో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయాలకి తాళాలు వేస్తామని అయ్యన్నపాత్రుడు హెచ్చరించారు. అవసరమైతే అంగన్వాడీ లతోపాటు వారి సమస్యల పరిష్కారం కోసం తాము కూడా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అయ్యన్నపాత్రుడు తేల్చి చెప్పారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ సమస్య వచ్చినా అంగన్వాడీలకు తన సహకారం ఉంటుందని తమకు మద్దతుగా వారి వెనుక నిలుస్తామని హామీ ఇచ్చారు. కాగా, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్ వాడీల ఆందోళన కొనసాగుతున్న విషయం తెలిసిందే. కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని, గ్రాట్యుటీతో పాటు ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు