Ayushman Card Eligibility: ఆయుష్మాన్ భారత్ కార్డు పొందాలంటే అర్హతలేంటో తెలుసా? వివరాలు మీకోసం..

ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు.. మీరు అర్హులా? కాదా? అనే విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పథకానికి అర్హతలేంటి? అనేది తెలుసుకుంటే.. దరఖాస్తు సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోవచ్చు. మరి ఆయుష్మాన్ భారత్ పథకానికి ఆర్హతలేంటో ఓసారి చూద్దాం..

New Update
Ayushman Card Eligibility: ఆయుష్మాన్ భారత్ కార్డు పొందాలంటే అర్హతలేంటో తెలుసా? వివరాలు మీకోసం..

Ayushman Card Eligibilities: మీరు పట్టణ ప్రాంతంలో నివసిస్తున్నా.. గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నా? కొన్ని నిబంధనల మేరకు ఆయా వర్గాల ప్రజలు ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులవుతారు. ఆ పథకాల ప్రయోజనాలను అందుకోవచ్చు. దేశంలో కేంద్ర, రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ ప్రజలను దృష్టిలో ఉంచుకుని అనేక రకాల పథకాలను(Govt Schemes) ప్రవేశపెట్టాయి. కొన్ని పథకాలు ఏళ్ల నుంచి కొనసాగుతుండగా.. మరికొన్నింటిని ఇటీవలి కాలంలో ప్రవేశపెట్టారు. రాబోయే కాలంలో మరికొన్ని పథకాలు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రభుత్వ పథకాల్లో ఆయుష్మాన్ భారత్ యోజన(Ayushman Bharat) కూడా ఒకటి. దీని పేరును ఇటీవల 'ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన-ముఖ్యమంత్రి యోజన'గా మార్చడం జరిగింది. అయితే, ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేయడానికి ముందు.. మీరు అర్హులా? కాదా? అనే విషయం తప్పకుండా తెలుసుకోవాలి. ఈ పథకానికి అర్హతలేంటి? అనేది తెలుసుకుంటే.. దరఖాస్తు సమయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అప్లై చేసుకోవచ్చు. మరి ఆయుష్మాన్ భారత్ పథకానికి ఆర్హతలేంటో ఓసారి చూద్దాం..

పథకం గురించి తెలుసుకోండి..

వాస్తవానికి, ఈ పథకం పేరు 'ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన్ ఆరోగ్య యోజన-ముఖ్యమంత్రి పథకం'గా మార్చడం జరిగింది. ఈ పథకం కింద అర్హులైన వ్యక్తులు అప్లై చేసుకుంటే.. ఆయుష్మాన్ కార్డులను జారీ చేస్తుంది ప్రభుత్వం. ఆ తరువాత ఆయుష్మాన్ కార్డ్ హోల్డర్స్.. ఎంప్యానెల్ చేయబడిన ఆస్పత్రులలో రూ. 5 లక్షల వరకు ఉచిత చికిత్స చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

దరఖాస్తుకు ముందు అర్హతలు తెలుసుకోండి..

మీరు ఆయుష్మాన్ భారత్‌కు దరఖాస్తు చేసుకుంటున్నారా? అయితే, అర్హతలేంటో ఇక్కడ తెలుసుకోండి.

1. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలై ఉండాలి.

2. భూమి లేని వ్యక్తి అయి ఉండాలి.

3. సాధారణ ఇల్లు కలిగి ఉండాలి.

3. షెడ్యూల్డ్ కులం, తెగకు చెందిన వారితో పాటు.. సామాన్య ప్రజలు కూడా అర్హులే.

4. దినసరి కూలీ అయి ఉండాలి.

5. నిరుపేద, గిరిజన ప్రజలు ఈ పథకానికి అర్హులు.

6. కుటుంబంలో ఎవరైనా వికలాంగులు ఉన్నట్లయితే, వారు ఈ పథకానికి అర్హులు అవుతారు. ఈ కార్డు ద్వారా వారికి ఉచితంగా చికిత్స అందించవచ్చు.

7. దరఖాస్తు సమయంలో రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, యాక్టీవ్ మొబైల్ నెంబర్ వెంట ఉంచుకోవాలి.

ఈ పథకానికి సంబంధించి ఏవైనా అనుమానాలుంటే.. ప్రభుత్వ వెబ్‌సైట్‌ https://abdm.gov.in/ ను సందర్శించడం ద్వారా పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

Also Read:

Kesineni Nani: ఐటీ నోటీసులకు చంద్రబాబు భయపడే వ్యక్తి కాదు: కేశినేని

Shah Rukh Khan: బాక్సాఫీస్ బాద్షాగా రికార్డు సృష్టించిన షారుఖ్‌ ఖాన్

Advertisment
Advertisment
తాజా కథనాలు