అయోధ్య (Ayodhya) లో డిసెంబర్ 25న శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(Sri Ram International Airport) ప్రధాని మోదీ (Modi) ప్రారంభించనున్నట్లు సమాచారం. ఆరోజు భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి(Vajapy) జన్మదినం సందర్భంగా ఆ రోజునే విమానాశ్రయాన్ని ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది. జనవరిలో 2024 లో అయోధ్యలో రామాలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది.
దానికంటే ముందుగానే విమానాశ్రయం ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, కేంద్ర మంత్రి వీకే సింగ్, సీఎం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ లు మంగళవారం అయోధ్య విమానాశ్రయ నిర్మాణాన్ని పరిశీలించారు. విమానాశ్రయ నిర్మాణ పనులను డిసెంబర్ 15 లోగా పూర్తి చేయాలని కోరారు.
విమానాశ్రయంలో పనులు వేగంగా జరుగుతున్నట్లు అధికారులు వివరించారు. డిసెంబర్ చివరి కల్లా మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి విమానాల నిర్వహణను ప్రారంభిస్తామని వివరించారు. ఈ విమానాశ్రయం మొత్తం 821 ఎకరాల భూమిని సేకరించి ఎయిర్‌పోర్ట్ ఆథారిటీకి అప్పగించారు. విమానాశ్రయం మొదటి దశలో 2200 మీటర్ల పొడవు, 45 మీటర్ల వెడల్పుతో రన్ వే పనులు 100 శాతం పూర్తియినట్లు అధికారులు తెలిపారు.
రానున్న రోజుల్లో రన్ వే ను 3750 మీటర్లకు విస్తరించే ఆలోచనలో ఉన్నట్లు విమానాశ్రయాధికారులు తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే భూమిని కూడా సేకరించినట్లు తెలిపారు. పొగమంచులో రాత్రి ల్యాండింగ్ కోసం సీఏటీ-1, ఆర్‌ఏఎస్‌ఏ సౌకర్యాల పని కూడా 100 శాతం పూర్తయ్యింది. విమానం ల్యాండింగ్ కోసం ఏర్పాటు చేసిన లైటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి.
ఇప్పటికే అగ్నిమాపక దళం వాహనాలు కూడా విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఆపరేషన్ కోసం లైసెన్సింగ్ ప్రక్రియ జరుగుతున్నట్లు తెలిసింది. ఈ క్యాలెండర్ ఏడాదిలోనే విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత, అయోధ్య ధామ్ విమానాశ్రయంలో ఎయిర్‌బస్ A320 వంటి విమానాలను ల్యాండింగ్ చేసే సౌకర్యం అందుబాటులోకి వస్తుంది.
Also read: రాజ్‌భవన్ రోడ్ క్లోజ్..ప్రయాణికులకు అలర్ట్!