Ayodhya : శ్రీరాముడు అయోధ్యలో(Ram Mandir Ayodhya) కొలువుదీరబోతున్నాడు. అయోధ్య నగరం తన నాథుని రాకకు ముస్తాబవుతోంది. జనవరి 22న శ్రీరామ మందిరంలో రాంలల్లాను ప్రతిష్ఠించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆహ్వాన పత్రాలు(Invitation Letters) పంపగా ఇప్పుడు తొలి ఆహ్వాన పత్రం వీడియో వైరల్ గా మారింది. ప్రాణ ప్రతిష్ఠ (Prana Pratishtha)కార్యక్రమంలో పలువురు వీవీఐపీలు పాల్గొననున్నారు. ఇప్పుడు దీని కోసం ఆహ్వాన లేఖలు కూడా పంపించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వాన పత్రికను సిద్ధం చేశారు. ఈ ఎరుపు రంగు కార్డుపై కుంకుమ రంగులో సందేశం రాసి ఉంది. ఈ ఆహ్వానపత్రంపై న్యూ గ్రాండ్ టెంపుల్ హోం(New Grand Temple Home)లో రామ్ లల్లా తన జన్మస్థానంలో తిరిగి వస్తున్నందుకు శుభ వేడుక అని పేర్కొన్నారు. ఈ కార్డులో రామమందిర నిర్మాణానికి సంబంధించి కాలక్రమేణ, దశల గురించి వివరాలను పేర్కొన్నారు.
ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవానికి వచ్చే అతిథుల భద్రతకు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవ్‌కు పంపుతున్న ఆహ్వాన పత్రంపై క్యూఆర్ కోడ్(QR Code) కూడా గుర్తు ఉంది. తద్వారా ఆహ్వానించబడిన ప్రముఖుడి వేషంలో ఇతరులు ప్రవేశించకుండా చర్యలు తీసుకున్నారు. భద్రతా సిబ్బంది దానిని స్కాన్ చేసి అతిథిని ధృవీకరిస్తారు.
కాగా ఈ కార్యక్రమం కోసం దాదాపు 6,000 ఆహ్వాన కార్డులు ముఖ్య వ్యక్తులకు పంపించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా(Amit Shah), యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్(UP CM Yogi Adityanath), యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్ తదితరులు హాజరుకానున్నారు. ఆహ్వానం అందుకున్న ముఖ్య వ్యక్తుల్లో సినీ నటులు రజనీకాంత్, అమితాబ్ బచ్చన్, మాధురీ దీక్షిత్, అనుపమ్ ఖేర్, అక్షయ్ కుమార్, దర్శకులు రాజ్ కుమార్ హిరానీ, సంజయ్ లీలా బన్సాలీ, రోహిత్ శెట్టి, తదితరులు ఉన్నారు.
ఇది కూడా చదవండి: కేసీఆర్ కు జగన్ పరామర్శ.. షర్మిల ప్రస్తావన వచ్చిందా?