Lord Shri Ram : శ్రీరాముడు ఈ లోకాన్ని ఎలా వీడాడు..?

శ్రీరాముడు 1,000 సంవత్సరాలకు పైగా భూమిని పాలించాడు. రాముడు విష్ణువు 7వ అవతారంగా పూజించబడ్డాడు. అటు శ్రీరాముని మరణానికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీరాముడు ఈ లోకాన్ని ఎలా వీడాడో తెలుసుకోవాడానికి ఆర్టికల్‌ మొత్తం చదవండి.

Lord Shri Ram : శ్రీరాముడు ఈ లోకాన్ని ఎలా వీడాడు..?
New Update

Lord Shri Ram : శ్రీరాము(Shri Ram) ని జీవితానికి సంబంధించిన కొన్ని వినని కథలు నేటికీ మనల్ని ఆలోచించేలా చేస్తాయి. సనాతన హిందూ సంప్రదాయంలో రాముడి పేరుకి ప్రత్యేక స్థానం ఉంది. రామ నామ తారక మంత్రం అన్ని దుఃఖాలను తొలగించి, సకల సంతోషాలను కలిగిస్తుందని హిందూ మత విశ్వాసం. అయోధ్య(Ayodhya) లో శ్రీ రామమందిర(Ram Mandir) లో నేడు సోమవారం(జనవరి 22, 2024)న రాంలల్లా(Ram Lalla) విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం జరుగుతుంది. శ్రీ రాముడు విష్ణువు 7వ అవతారంగా పూజించబడ్డాడు. శ్రీరాముని జన్మ వృత్తాంతం అందరూ వినే ఉంటారు కానీ శ్రీరాముడు ఎలా చనిపోయాడో తెలుసా. శ్రీరాముని మరణానికి సంబంధించిన కథల గురించి తెలుసుకుందాం.

శ్రీరాముడు ఎలా మరణించాడు..?

శ్రీరాముని మరణానికి సంబంధించి అనేక కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మొదటి కథ ప్రకారం.. సీతామాత తన ఇద్దరు పిల్లలైన లవ్, కుష్‌లను శ్రీరాముడికి అప్పగించి, మాతృభూమిలో కలిసిపోయినప్పుడు సీతామాత నిష్క్రమణతో శ్రీరాముడు చాలా బాధపడ్డాడు. యమరాజ్ నుంచి సమ్మతి తీసుకున్న తరువాత.. అతను సరయూ నదిలో జలసమాధి అయ్యారు.

సరయూ నదిలో జలసమాధి:

శ్రీరాముడు 1000 సంవత్సరాలకు పైగా భూమిని పాలించాడు. రాముడు తన అవతారాన్ని ముగించి ఋషి రూపంలో వచ్చినప్పుడు.. యమరాజ్ కూడా ఋషి రూపంలో వచ్చి.. రాయుడితో మాట్లాడమని కోరారు. అంతేకాదు మాట్లాడేటప్పుడు మధ్యలో ఎవరూ రాకూడదని షరతు పెట్టాడు. ఆ టైంలో భగవాన్ శ్రీ రాముడు సోదరుడు లక్ష్మణ్‌తో తనకు ఏకాంతం కావాలని..ఎవరూ లోపలికి రాకుండా తలుపు దగ్గర నిలబడమని చెప్పాడు. ఈ సమయంలో..దుర్వాస మహర్షి అక్కడికి వచ్చి రాయుడిని కలవాలని కోరడు. దీనికి లక్ష్మణుడు నిరాకరించిన తర్వాత కూడా ఋషి అంగీకరించలేదు. దీంతో ఆయన కోపంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.

దుర్వాసుని కోపం నుంచి తప్పించుకోవడానికి.. లక్ష్మణుడు శ్రీరాముడు మాట్లాడుతున్న గదిలోకి వెళ్లాడు. అది చూసిన శ్రీరాముడు కూడా లక్ష్మణునిపై కోపించి అతనికి మరణశిక్ష విధించకుండా దేశానికి బహిష్కరించాడు. లక్ష్మణుడికి అది కూడా మృత్యువు లాంటిదే అని భావించి. సరయూ నదిలో మునిగిపోయి శేషనాగ రూపాన్ని ధరించాడు. తన సోదరుడి జలసమాధితో బాధపడిన శ్రీరాముడు కూడా జలసమాధి అవ్వాలని నిర్ణయించుకున్నాడు. సరయూ నది లోపలికి వెళ్లి విష్ణుమూర్తి అవతారం ఎత్తాడు. ఈ విధంగా శ్రీరాముడు తన మానవ శరీరాన్ని వదిలి వైకుంఠ ధామానికి వెళ్ళాడని పద్మపురాణం కథం చెబుతుంది.

ఇది కూడా చదవండి: పచ్చబొట్టు వేయించుకుంటున్నారా..ఈ విషయాలు తెలుసుకోండి

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు.

#ayodhya-ram-mandir #sarayu-river #ram-lalla #shriram
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe