Lakshman Kila: లక్ష్మణుడు తన శరీరాన్ని విడిచిపెట్టిన ప్రదేశం ఇదే.. ఎన్నో అద్భుతాలకు సాక్షి!

అయోధ్యలోని లక్ష్మణ్ కోట గురించి తెలుసా? ఈ ఆలయంలో దైవిక శక్తులు ఉన్నాయని భక్తులు నమ్ముతారు. ఈ కోట పక్కనే ఉన్న సరయు నదిలో లక్ష్మణుడు ప్రాణాలు వదిలాడని రామభక్తుల విశ్వాసం. దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్‌ మొత్తం చదవండి.

New Update
Lakshman Kila: లక్ష్మణుడు తన శరీరాన్ని విడిచిపెట్టిన ప్రదేశం ఇదే.. ఎన్నో అద్భుతాలకు సాక్షి!

దశరథ సూత.. శ్రీరామ.. అయోధ్య రామమందిరం(Ayodhya Ram Mandir)వైపే యావత్ దేశంచూపు నెలకొంది. రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ఠకు సిద్ధంగా ఉంది. అయోధ్య మొత్తం పెళ్లికూతురులా ప్రకాశిస్తుంది. అయితే అయోధ్యలో కేవలం రాముడి గుడి మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. అన్నయ్య కోసం సర్వస్వం త్యాగం చేసిన లక్ష్మణుడి(Lord Laxman) కోట ఉంది. భర్త కోసం ప్రాణాలర్పించేందుకు సిద్ధపడిన సీతామాత రాజభవనం ఉంది. రాముడే సర్వస్వంగా బతికిన ఆంజనేయుడే అయోధ్య మొత్తాన్ని కాపలా కాస్తున్నాడు.

ప్రత్యేక ఆకర్షణగా కోట:
రాజ్యం, సంపద, అధికారాలు అన్నీ వదిలేసి కష్టాల్లోనూ, సంతోషాల్లోనూ రాముడికి అండగా నిలిచిన లక్ష్మణుడి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అయోధ్యలో లక్ష్మణుడి కోసం ఉన్న కోట ప్రజలను ఆకర్షిస్తోంది. రాముడు లేకుండా లక్ష్మణుడు లేడు. లక్ష్మణుడు లేని రాముడు లేడు. రాముడు అయోధ్యను విడిచి వనవాసానికి బయలుదేరినప్పుడు.. లక్ష్మణుడు శ్రీరాముని వెనుక వెళ్లిన విషయం తెలిసిందే. అలాంటి సోదరుడి కోసం అయోధ్యలో మహాకోట కట్టారు. ఈ కోటను లక్ష్మణ ఖిలా(Lakshmana Kila) లేదా లక్ష్మణ ప్యాలెస్ అని పిలుస్తారు.

publive-image ప్రతీకాత్మక చిత్రం

లక్ష్మణ ఖిలా.. ఎన్నో అద్భుతాలకు సాక్షి!

విశేషమేమిటంటే, ఈ లక్ష్మణ ఖిలాలో శ్రీరాముడు సీతాదేవితో కొలువై ఉన్నాడు. ఈ కోట చాలా గొప్పది. ఈ పవిత్ర స్థలంలో ఎవరైనా అబద్ధం చెబితే అది ఎక్కువ కాలం ఉండదు. ఇక్కడ అబద్ధాన్ని దాచడం అసాధ్యం. ఇక్కడ కొలువై ఉన్న శ్రీరాముడిని తప్పకుండా మూడుసార్లు పూజిస్తారు. లక్ష్మణ ఖిలాలోని కోటలో శ్రీరాముని విగ్రహాన్ని అలంకరించిన తర్వాత, ఆ అలంకారం అద్దంలో రాముడికి చూపిస్తారట. భజనలు, స్త్రోత్రాల పఠనం ఇక్కడ నిరంతరం ఉంటుంది.

publive-image సరయు నది

శరీరాన్ని విడిచిన ప్రాంతం:
ఈ కోట పక్కనే సరయు నది ఉంటుంది. ఈ నది ఒడ్డున లక్ష్మణుడు తన శరీరాన్ని వదిలేశారని చెబుతుంటారు. దీనికి పౌరాణిక నేపథ్యం కూడా ఉంది. ఒకప్పుడు ఈ కోటలో శ్రీరాముడు, కాలదేవుడు యమతో సమావేశమయ్యారు. ఆ సమయంలో రాముడు తన సోదరుడు లక్ష్మణుడిని కోట లోపలికి ఎవరినీ రానివ్వకుండా చూడాలని చెప్పాడు. సంభాషణకు ముందు రాముడికి యమ పెట్టిన షరతు ఇదే. వారి సంభాషణ గోప్యంగా ఉండాలని, గదిలోకి ప్రవేశించిన వారిని ఉరితీయాలని కఠినమైన సూచనలను ఇచ్చాడు. రాముడు అంగీకరించాడు. లక్ష్మణునికి తన తలుపు కాపలాగా మరియు యమకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యతను అప్పగించాడు. అయితే శపాలు పెట్టడంతో పేరుగాంచిన దుర్వాస ముని కోట లోపలకి వెళ్లాలని ప్రయత్నించాడు. లక్ష్మణుడు అడ్డుకోవడంతో అయోధ్యను శపిస్తానని దుర్వాస ముని చెప్పాడు. దీంతో అయోధ్యకు చెడు జరగడం ఇష్టం లేని లక్ష్మణుడు మునిని లోపలకి వెళ్లనిస్తాడు. అన్నయ్య మాట తప్పడంతో లక్ష్మణుడు సరయూ నదిలో మునిగి శరీరాన్ని విడిచాడని రామభక్తుల విశ్వాసం.

Also Read: అయోధ్య వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. రామ్ రసోయిలో ..ఉచితంగా..!!

WATCH:

Advertisment
తాజా కథనాలు