/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/ramlalla-2-jpg.webp)
Holiday For Maharashtra: దేశమంతా రామమయంగా మారింది. అందరూ జనవరి 22 కోసమే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికి పలు రాష్ట్రాలు, సంస్థలు ఆ రోజును సెలవుగా ప్రకటించాయి. ఇక ఒక్కొక్కరుగా అందరూ సెలవులు అనౌన్స్ చేస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మహరాష్ట్ర కూడా చేరింది. అయోధ్యలోని రామాలయంలో (Ayodhya Ram Mandir) రామ్‌లల్లా ప్రతిష్ఠ సందర్భంగా మహారాష్ట్రలో పబ్లిక్ హాలిడే ఉండనుంది. మహారాష్ట్ర ప్రభుత్వం జనవరి 22న ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. రాష్ట్రంలో బీజేపీతో పాటు ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే(Eknath Shinde) నేతృత్వంలోని శివసేన ఎమ్మెల్యేలు కూడా సెలవు ప్రకటించాలని కోరిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఎమ్మెల్యేలు సీఎం ఏక్ నాథ్ షిండేకు లేఖ కూడా రాశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం జనవరి 22న హాలిడే ఫిక్స్ చేశారు.
ఏం మూసి వేస్తారు?
మహారాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ముంబై, పూణేతో సహా మొత్తం రాష్ట్రంలో జనవరి 22న ప్రభుత్వ సెలవు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ బ్యాంకులు, బీమా సంస్థలు మధ్యాహ్నం 2:30 గంటల వరకు మూసి వేసి ఉంటాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు రోజంతా క్లోజ్ చేసి ఉంచుతారు. రామాలయంలో రామ్ లల్లా ప్రతిష్ఠ కోసం ఉత్తరప్రదేశ్, హర్యానా, గోవా, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలు ఇప్పటికే సెలవు ప్రకటించాయి. గుజరాత్ ప్రభుత్వం హాఫ్ డే సెలవు ప్రకటించింది. జనవరి 22న మద్యం అమ్మకాలను నిలిపివేయాలని పలు రాష్ట్రాలు ఆదేశించాయి.
ఉద్యోగులు వేడుకల్లో పాల్గొనేందుకు వీలుగా జనవరి 22న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలను హాఫ్ డే హాలీడే ప్రకటిస్తునట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మరుసటి రోజే ఏక్‌నాథ్‌షిండే సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. మరోవైపు జనవరి 22న అయోధ్యలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మూడు రోజుల ముందు రామ్ లల్లా విగ్రహం (Ram Lalla Idol) మొదటి చిత్రాన్ని భక్తుల కోసం రిలీజ్ చేశారు. నల్లరాతితో చెక్కిన ఈ విగ్రహం కళ్లను పసుపు వస్త్రంతో కప్పి గులాబీల దండతో అలంకరించినట్లు విశ్వహిందూ పరిషత్ అధికారి శరద్ శర్మ తెలిపారు. ఇందులో రాముడు ఐదేళ్ల పసి బాలుడుగా చూడముచ్చటగా ఉన్నారు.
Also Read: నాకు ఓ ఇల్లుంటే బాగుండేది.. కన్నీళ్లు పెట్టుకున్న ప్రధాని