Ayodhya Ram Mandir: పూలు, లైటింగ్‌ తో మెరిసిపోతున్న అయోధ్య..!

అయోధ్య రామ మందిరాన్ని ఆలయాధికారులు ఇప్పటికే పూలు, ప్రత్యేక విద్యుత్‌ లైట్లతో అలంకరించారు. శీతాకాలం కావడంతో పూలు చాలా రోజులు వరకు తాజాగా ఉండడమే కాకుండా..మంచి సువాసనలు కూడా వెదజల్లుతాయి.

New Update
Ayodhya Ram Mandir: పూలు, లైటింగ్‌ తో మెరిసిపోతున్న అయోధ్య..!

Ayodhya Ram Mandir: ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న అయోధ్య రామ మందిర (Ayodhya Ram Mandir) ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగడానికి ఇంకా ఒక్కరోజు మాత్రమే ఉంది. ఈ కార్యక్రమం కోసం అధికారులు ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలయాధికారులు రామమందిరాన్ని ఇప్పటికే రిచ్‌స్టాక్‌ పూలతో, ప్రత్యేక దీపాలతో అలంకరించారు.

మంచి సువాసనలు కూడా..

సోమవారం వరకు కూడా ఈ ప్రత్యేక పూల అలంకరణలు (Flowers Decorations) జరగనున్నాయి. ఇవన్నీ కూడా తాజా పువ్వులు కావడంతో పాటు శీతాకాలం కూడా కావడంతో పువ్వులు అంత త్వరగా వాడిపోవడం లేదు. దాంతో ఈ పువ్వులు అన్ని కూడా ప్రాణప్రతిష్ఠ వరకు కూడా తాజాగా ఉంటాయి. కేవలం అలంకారానికి మాత్రమే కాకుండా మంచి సువాసనలు కూడా వెదజల్లుతుంటాయి.

అయోధ్య రామాలయాన్ని ఇసుకతో..

అలాగే రామమందిరాన్ని పూల అలంకరణతో పాటు విద్యుత్‌ లైట్లను (Lighting) కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ ట్రస్టు అధికారులు వివరించారు. ఈ అలంకరణలు కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ట్రస్టు అధికారులు తెలిపారు. ఇదిలా ఉంటే.. ఒడిశాకు చెందిన ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్ రామ్‌ కథా పార్క్‌ వద్ద అయోధ్య రామాలయాన్ని ఇసుకతో వేశారు. చూసిన వారందరూ రామ మందిరం గురించి కొనియాడుతున్నారు.

పర్యవేక్షణ బాధ్యతలు...

ఇదిలా ఉండగా రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి మరో 24 గంటలు మాత్రమే సమయం ఉండడంతో అధికారులు అంతా అయోధ్యలో అప్రమత్తమయ్యారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ దళం అయోధ్య రామ మందిరానికి దగ్గరలో శిబిరాన్ని ఏర్పాటు చేసింది. స్థానిక పోలీసు అధికారులతో సమన్వయం అవుతూ అధికారులు పర్యవేక్షణ బాధ్యతలు చేపట్టారు.ఇప్పటికే మూడు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు అయోధ్యకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు.

రాములోరి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముహుర్తం దగ్గర పడుతున్న వేళ పాక్‌ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న జైషే మహ్మద్‌ ఉగ్ర సంస్థ బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఉగ్ర సంస్థ నుంచి బెదిరింపులు వచ్చాయి. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ముస్లింల ను చంపి ప్రారంభిస్తున్నారంటూ హెచ్చరికలు చేసింది.

దీంతో భద్రతాదళాలు మరింత అప్రమత్తమయ్యాయి. ఇప్పటికే అయోధ్యలో కేంద్ర ప్రభుత్వం, పోలీసు అధికారులు హై అలర్ట్‌ ప్రకటించారు. రెండు రోజుల క్రితం యూపీ యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌ ముగ్గురు ఖలీస్థానీ సానుభూతిపరులను అరెస్ట్‌ చేసింది. శనివారం నాడు ఖలిస్థాని వేర్పాటు వాద నాయకుడు పన్నూ కూడా ఓ ఆడియో ని విడుదల చేశాడు.

Also read: శీతాకాలం జలుబు బాగా బాధిస్తుందా..అయితే ఈ టిప్స్‌ ఫాలో అయిపోండి మరి!

Advertisment
తాజా కథనాలు