Diwali: అయోధ్యలో సరికొత్త రికార్డు.. ఒకేసారి 22.23 లక్షల దీపాల వెలుగులు..

దీపావళి పండుగ సందర్భంగా యూపీలోని అయోధ్య తమ రికార్డును తిరగరాసింది. 51 ఘాట్‌లలో ఏకంగా 22.23 లక్షల దీపాలు వెలిగించి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది. సరయూ నది తీరంలో దీపావళికి ఒకరోజు ముందు 'దీపోత్సవ్‌' కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితిగా వస్తోంది.

New Update
Diwali: అయోధ్యలో సరికొత్త రికార్డు.. ఒకేసారి 22.23 లక్షల దీపాల వెలుగులు..

దీపావళి పండగను పురస్కరించుకొని అత్యధిక దీపాలు వెలిగించి ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య ప్రపంచ రికార్డు సాధించింది. ఏకంగా ఒకేసారి 22.23 లక్షలకుపైగా దీపాలు వెలిగించి గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును కైవసం చేసుకుంది. సరయూ నదీతీరంలో దీపావళికి ఒకరోజు ముందు 'దీపోత్సవ్‌' కార్యక్రమాన్ని నిర్వహించడం అక్కడ ఆనవాయితీగా వస్తోంది. గత ఏడాది 15 లక్షల దీపాలు వెలిగించి రికార్డు నెలకొల్పింది. అయితే ఈ ఏడాది 51 ఘాట్‌లలో 22.23 లక్షల దీపాలు వెలిగించి తమ రికార్డునే బద్దలు కొట్టింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 25 వేల మందికిపైగా వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Also read: ఎస్ఐ అభ్యర్థులకు హైకోర్ట్ బిగ్ షాక్.. మళ్ళీ పరీక్ష!

2017లో యూపీలో భాజపా అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రతి సంవత్సరం అయోధ్యలో ఈ దీపోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. మొదటి ఏడాది 51వేల దివ్వెలను వెలిగించగా.. ఆ తర్వాత 2018లో దాదాపు 3లక్షల దీపాలను వెలిగించారు. ఆ ఏడాది దక్షిణ కొరియా ప్రథమ మహిళ కిమ్‌ జంగ్‌ సూక్‌ కూడా ముఖ్య అతిథిగా హాజరై వేడుకను వీక్షించారు. ప్రస్తుతం అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న నేరథ్యంలో.. ఈ ఏడాది ఈ దీపోత్సవ్‌ కార్యక్రమం మరింత ప్రత్యేకతను సంతరించుకుంది. 50 దేశాలకు చెందిన రాయబారులు, ఇతర ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి వచ్చారు. దీపోత్సవ్‌కు ముందు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని ఆకట్టుకున్నాయి. 2019లో 4.10లక్షలు, 2020లో దాదాపు 6లక్షలు, 2021లో 9లక్షలకు పైగా దీపాలను వెలిగించి అయోధ్య గిన్నిస్‌ రికార్డును సొంతం చేసుకుంది.

Advertisment
తాజా కథనాలు