Ayodhya Railway Station: అయోధ్యలో రామ మందిరి ప్రారంభోత్సవానికి నెల రోజుల ముందు శనివారం నాడు మరో కీటక ఘట్టానికి నాంది పలికారు ప్రధాని నరేంద్ర మోదీ. అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఈ స్టేషన్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టంగా పేర్కొన్నారు ప్రధాని. ఈ మేరకు ఎక్స్‌లో ఓక పోస్ట్ చేసిన ప్రధాని మోదీ.. 'కొత్తగా నిర్మించిన విమానాశ్రయం, పునరాభివృద్ధి చేసిన రైల్వే స్టేషన్‌ను ప్రారంభించే అవకాశం లభించింది. వీటితో పాటు.. మరికొన్ని ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనం చేయడం జరిగింది. ఇవి ప్రజల జీవన ప్రమాణాలను మరింత పెంచుతాయి' అని పేర్కొన్నారు. అయితే, ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించిన అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌కు 5 ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మరి ఆ 5 ప్రత్యేకతలు ఏంటో ఓసారి చూద్దాం..
స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్..
అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్‌ను రూ. 240 కోట్లతో పునరాభివృద్ధి చేశారు. ఇందులో ఫుడ్ ప్లాజా, వెయిటింగ్ హాల్, టాయిలెట్‌లు, తాగునీటి స్టేషన్‌లు, ఎస్కలేటర్‌లు, లిఫ్టులు, స్టాఫ్ రూమ్‌లు, దుకాణాలు వంటి సకల సౌకర్యాలతో కూడిన ఆధునిక మూడు అంతస్తుల భవనం ఉంది. వెయిటింగ్ హాల్, గదులు, పాదచారుల వంతెన ఈ స్టేషన్‌లో స్పెషల్.
యాక్సెసిబిలిటీ, ఎన్విరాన్‌మెంటల్ సర్టిఫికేషన్..
ఈ స్టేషన్ అందరికీ అందుబాటులో ఉంది. కనెక్టివిటీ కూడా ఎక్కువే. పర్యావరణ సుస్థిరత విషయంలో ఈ స్టేషన్‌ను ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (IGBC) గ్రీన్ స్టేషన్ భవనంగా ధృవీకరించింది.
ప్రత్యేక సౌకర్యాలు..
శిశు సంరక్షణ గది, ప్రథమ చికిత్స కోసం ప్రత్యేక గదిని ఏర్పాటు చేయడం జరిగింది. పక్కా ప్రణాళికాబద్దంగా సౌకర్యాలు కల్పించిన స్టేషన్‌గా అయోధ్య ధామ్ జంక్షన్ రైల్వే స్టేషన్ నిలిచింది. ఇది ప్రయాణీకుల సౌకర్యార్థం ప్రత్యేక డెస్క్, టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ సెంట, 7,200 చదరపు మీటర్ల విస్తీర్ణంలో దేశంలోనే అతిపెద్ద కాన్కోర్స్‌ను కలిగి ఉంది.
సింబాలిక్ డిజైన్..
స్టేషన్ పై అంతస్తులో భగవాన్ రాముడితో అయోధ్యకు ఉన్న లోతైన సంబంధాన్ని హైలైట్ చేస్తూ సింబాలిక్ విల్లుతో 'ముకుట్' ప్రేరేపిత నిర్మాణం ఉంది.
విమానాశ్రయం వంటి ఫీచర్లు..
విమానాశ్రయ పునరాభివృద్ధికి సమానమైన థీమ్‌ను ప్రతిబింబిస్తూ, స్టేషన్‌లో రాక, పోకలకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు ఉన్నాయి. టాక్సీ బే, విస్తారమైన వరండా వంటి ప్రామాణిక సౌకర్యాలు ఉన్నాయి. అగ్నిప్రమాపక ప్రమాణాలు ఉన్నాయి. ఈ స్టేషన్‌లో లైటింగ్ అద్భుతంగా ఉంటుంది. రాత్రి వేళ పాత, కొత్త స్టేషన్ భవనాలు గులాబీ రంగు లైట్స్‌తో తళుక్కుమంటాయి.
Also Read:
జగత్జంత్రీలు.. ఏకంగా పోలీస్ స్టేషన్‌లోనే చోరీ చేశారు..!
తెలంగాణ సర్కార్ మరో గుడ్ న్యూస్.. వారందరికీ రూ. 5 లక్షల బీమా..