/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-8-3-jpg.webp)
Umapathi Trailer: డైరెక్టర్ సత్య ద్వారపూడి దర్శకత్వంలో అవికా గోర్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'ఉమాపతి'. ఈ చిత్రాన్ని కృషీ క్రియేషన్స్ బ్యానర్ పై కొణిదెన కోటేశ్వర్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అవికా గోర్ సరసన అనురాగ్ హీరోగా నటిస్తున్నారు. పోసాని కృష్ణ మురళి, ఆటో రామ్ ప్రసాద్, కమీడియన్ భద్రం, తులసి, ప్రవీణ్, శివనారాయణ, జయవాణి, త్రినాథ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. పల్లెటూరి బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం డిసెంబర్ 29 న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
Bigg Boss 7 Telugu: ఫినాలేకు ముందే 10 లక్షల ఆఫర్.. శివాజీ చేతిలో సూట్ కేస్..! - Rtvlive.com
రెండు నిమిషాల పాటు సాగిన ఈ ట్రైలర్ లవ్ స్టోరీ, ఎమోషన్స్, కడుపుబ్బ నవ్వించే కామెడీ సీన్స్ తో అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ట్రైలర్ లోని పల్లెటూరి విజువల్స్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్ లో అవికాగోర్ అచ్చ తెలుగు అమ్మాయిల కనిపించింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీతో ఈ సినిమా రూపొందుతోంది. 'ఉమాపతి' సినిమాకు 'ఫిదా' ఫేమ్ శశికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నారు. గౌతమ్ రాజు ఎడిటర్ గా, NN రాఘవేంద్ర కుమార్ డీఓపీ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే అవికాగోర్ నటించిన మ్యాన్షియన్ 24, వధువు వెబ్ సీరీస్ లు మంచి విజయాన్ని అందుకున్నాయి. సస్పెన్స్ త్రిల్లర్ గా విడుదలైన 'వధువు' వెబ్ సీరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అవికాగోర్ వధువు సీజన్ 2 కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఉన్నారు.