Autowala Protest: తూర్పుగోదావరి జిల్లాలో ఆటోవాలా బంద్.. రాజకీయ పార్టీలపై కన్నెర్ర..! తూర్పుగోదావరి జిల్లాలో ఆటోవాలాలు 24గంటలు బంద్ ప్రకటించారు. రాజకీయ పార్టీలు మహిళలకు ఫ్రీ బస్సు మ్యానిఫెస్టోపై ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మా పొట్ట కొట్టవద్దు అంటూ రాజమండ్రిలో ఆటో డ్రైవర్స్ శాంతి యుత ర్యాలీ చేశారు. By Jyoshna Sappogula 23 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి East Godavari District: కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఏపీలోనూ మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యాం కల్పించేలా టీడీపీ, వైసీపీ పార్టీలు ప్లాన్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో, తూర్పుగోదావరి జిల్లాలో ఆటోవాలాలు 24 గంటలు బంద్ ప్రకటించారు. రాజకీయ పార్టీలు మహిళలకు ఫ్రీ బస్సు మ్యానిఫెస్టోపై ఆటో డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. Also Read: రాజ్ కొంపలో కుంపటి పెట్టిన రుద్రాణి.. భర్త కోసం కుమిలిపోతున్న కావ్య..! అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని సూపర్ సిక్స్ మానిఫెస్టోలో టీడీపీ పెట్టింది. అయితే, మరోవైపు అధికారంలో ఉండగానే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేసే యోచనలో అధికార పార్టీ వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో, రాజమండ్రిలో ఆటో డ్రైవర్లు శాంతి యుత ర్యాలీ చేపట్టారు. Also Read: తెలంగాణలో హడావిడి చేసి ఏపీకి ఎందుకొచ్చావ్?: లక్ష్మీపార్వతి ఎన్నికల మేనిఫెస్టోలో ఉచిత పథకాలను పెట్టి మా పొట్టకొట్ట వద్దని ఆటోడ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల తమ జీవనోపాది దెబ్బతింటుందని కుటుంబాలు రోడ్డున పడతాయని వాపోతున్నారు. పార్టీలు తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యమం మరింత తీవ్రతం చేస్తామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆటోల బందుతో రాజమండ్రిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. #auto-drivers-protest #east-godavari-district మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి