Maruti Fronx: జస్ట్ రూ. 50 వేలు ఉంటే కొత్త కారు మీ సొంతం.. పూర్తి వివరాలు ఇవే.. ప్రస్తుతం దేశంలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ విభాగంలో మార్కెట్లో చాలా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే, మారుతి సుజుకి ఈ సెగ్మెంట్లో తన ఫ్రాంక్స్ SUV ని విడుదల చేసింది. ఈ కారు డిజైన్, అందులో ఉన్న ఫీచర్లు, అధిక మైలేజీ, తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో బాబా పాపురల్ అవుతోంది. మార్కెట్‌లో విపరీతంగా అమ్ముడవుతోంది. By Shiva.K 17 Sep 2023 in బిజినెస్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి Maruti Suzuki Fronx: ప్రస్తుతం దేశంలో కాంపాక్ట్ SUV సెగ్మెంట్(Maruti Suzuki Fronx) బాగా ప్రాచుర్యం పొందుతోంది. ఈ విభాగంలో మార్కెట్లో చాలా మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. కొద్ది నెలల క్రితమే, మారుతి సుజుకి ఈ సెగ్మెంట్లో తన ఫ్రాంక్స్ SUV ని విడుదల చేసింది. ఈ కారు డిజైన్, అందులో ఉన్న ఫీచర్లు, అధిక మైలేజీ, తక్కువ ధరకే అందుబాటులో ఉండటంతో బాబా పాపురల్ అవుతోంది. మార్కెట్‌లో విపరీతంగా అమ్ముడవుతోంది. మీరు కూడా ఈ కారును కొనుగోలు చేయాలనుకుంటున్నట్లయితే.. అదిరిపోయే న్యూస్ మీకోసం తీసుకువచ్చాం. ఈ కారును కొనేందుకు పూర్తి మొత్తంలో డబ్బులు లేకపోతే.. కొంత మొత్తంలో డౌన్ పేమెంట్ కట్టి కారును సొంతం చేసుకోవచ్చు. ఆ తరువాత మిగిలిన మొత్తాన్ని ఇఎంఐ రూపంలో చెల్లించవచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ ధర ఎంత ? మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7,46,500 నుండి ప్రారంభమవుతుంది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ వేరియంట్ ఆన్ రోడ్ ధర రూ. 8,37,667. నగదు చెల్లించి కొనుగోలు చేస్తే రూ.8.37 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. ఫైనాన్స్, EMI ప్లాన్‌లు.. ఒకవేళ మొత్తం అమౌంట్‌ను ఒకేసారి చెల్లించలేకపోతే.. కొంత మొత్తంలో డౌన్‌పేమెంట్ చెల్లించవచ్చు. మిగిలిన మొత్తాన్ని ఇఎంఐ కింద పే చేయొచ్చు. మీరు ఈ కారును ఫైనాన్స్‌పై కొనుగోలు చేయాలనుకుంటే కేవలం రూ.50 వేలు డౌన్ పేమెంట్ చేసి ఇంటికి తీసుకెళ్లవచ్చు. ఆన్‌లైన్ ఫైనాన్స్ ప్లాన్ కాలిక్యులేటర్ ప్రకారం.. రూ. 50 వేలు డౌన్ పేమెంట్ చేసిన తర్వాత.. మిగిలిన రూ. 7,87,661 లను రుణం తీసుకోవాల్సి ఉంటుంది. దానిపై వార్షిక వడ్డీ రేటు దాదాపు 9.8 శాతం చెల్లించాల్సి ఉంటంది. ఈ లోన్ ప్లాన్ 5 సంవత్సరాల కాలానికి ఫిక్స్ చేయబడుతుంది. ఇందుకోసం మీరు ప్రతి నెలా రూ. 16,658 EMI చెల్లిస్తే సరిపోతుంది. ఇంజిన్, మైలేజ్.. మారుతి సుజుకి ఫ్రాంక్స్ కారు ఇంజిన్, మైలేజీ గురించి తెలుసుకుందాం. మారుతి సుజుకి ఫ్రాంక్స్ 1.2L 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఇది 6000 ఆర్‌పిఎమ్ వద్ద 88.50 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ అవుట్‌పుట్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో 5 స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గేర్‌బాక్స్ కలదు. ఇది లీటరుకు 21.79 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. Also Read: Hyderabad: చిన్నారులకు డబ్బులు పంచిపెడుతున్న మంత్రి మల్లారెడ్డి.. ఎందుకో తెలుసా? Kaapu politics: రంగా లక్ష్యలను, ఆశయాలను తాకట్టు పెట్టారు.. పవన్‌కి వ్యతిరేకంగా విజయవాడలో మీటింగ్! #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి