Annamaya District: వీడిన ఆటో డ్రైవర్‌ డెత్‌ మిస్టరీ.. అడ్డుగా ఉన్నాడని లేపేశాడు..!

అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఆటోడ్రైవర్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆటోడ్రైవర్‌ సుధాకర్‌ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు.

Annamaya District: వీడిన ఆటో డ్రైవర్‌ డెత్‌ మిస్టరీ.. అడ్డుగా ఉన్నాడని లేపేశాడు..!
New Update

అన్నమయ్య జిల్లా పీలేరులో జరిగిన ఆటోడ్రైవర్‌ హత్య కేసు మిస్టరీ వీడింది. ఆటోడ్రైవర్‌ సుధాకర్‌ హత్యకు అక్రమ సంబంధమే కారణమని పోలీసులు తేల్చారు. సుధాకర్‌ బతుకు దెరువు కోసం కువైట్‌ వెల్లాడని, దీంతో అతని భార్య అశ్విని ఒంటరిగా ఉండటంతో కిషోర్‌ అనే వ్యక్తి పరిచేయం ఏర్పడుచుకున్నట్లు వెల్లడించారు. వారి పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారి తీసిందన్నారు. కాగా కరోనా సమయంలో సుధాకర్‌ ఇండియాకు తిరిగి వచ్చాడని, కోవిడ్‌ నిబంధనలును కేంద్ర ప్రభుత్వం ఎత్తివేశాక సుధాకర్ మళ్లీ కువైట్‌కు వెళ్తాడని అతని భార్య అశ్విని భావించిందని, కానీ సుధాకర్‌ ఇక్కడే అటో తోలుకుంటూ జీవనం కొనసాగించాడని వెల్లడించారు.

ఇదే సమయంలో భార్య ప్రవర్తనపై అనుమానం రావడంతో సుధాకర్ కిషోర్‌కు వార్నింగ్‌ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో సుధాకర్‌ను హత్య చేయాలని కిషోర్‌ ప్లాన్‌ వేసుకున్నట్లు, ఇందుకోసం కిషోర్‌ తిరుపతికి చెందిన ముగ్గురికి సుఫారీ ఇచ్చినట్లు వెల్లడించారు. దీంతో రంలోకి దిగిన మర్డర్‌ ముఠా.. సుధాకర్‌ ఆటో ఎక్కారని, ఆటో వెళ్తున్న సమయంలో ఎవరికీ అనుమానం రాకుండా వెనక నుంచి పాయిజన్‌ ఇంజక్షన్‌ ఇచ్చినట్లు తేల్చారు. అనంతరం నిందితులు ఆటో దిగి వెళ్లిపోయారని, వారు వెళ్లిన కొద్దిసేపటికే సుధాకర్‌ మృతి చెందాడని తెలిపారు.

మరోవైపు అశ్విని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రధాన నిందితుడు కిషోర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు వాలంటీరిగా విధులు నిర్వహిస్తుండగా.. గత నెల 28న తన ఉద్యోగానికి రాజీనామా చేసినట్లు తెలిపారు. కాగా సుధాకర్‌ను చంపిన ముగ్గురి నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు ఈ హత్యలో సుధాకర్‌ భార్య ప్రమేయం ఉందా అనే కోణంలో సైతం పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు ఆగస్ట్ 28న తన ఉద్యోగానికి రాజీనామా చేశాడన్న పోలీసులు.. సుధాకర్‌ను చంపి ఇద్దరు ఎక్కడికైనా చెక్కెయ్యాలనే ప్లాన్‌ వేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

#autodriver #kishore #annamaya-district #sudhakar #hatya #sufari #ashwini
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe